బైజూస్ బెంబేలు.. ఆస్తులు అమ్మేసుకుంటున్నారే!
అయితే.. అనూహ్యంగా ఈ సంస్థ అప్పుల పాలైంది. బెంగళూరులోని సంస్థలపై ఐటీ అధికారులు దాడులు కూడా చేశారు
బైజూస్.. విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే చదువును చేరువ చేసిన సంస్థ. కరోనా సమయంలో విద్యార్థులకు మరింత ఎక్కువగా ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ప్రబుత్వాలు కూడా.. బైజూస్‌తో ఒప్పందా లు చేసుకున్నాయి. ఏపీ అయితే.. మరింత ఎక్కువగానే కోట్లలో ఒప్పందాలు చేసుకుని కంటెంట్ ను కొనుగోలు చేసింది. ఇలా.. దేశవ్యాప్తంగా బైజూస్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
అయితే.. అనూహ్యంగా ఈ సంస్థ అప్పుల పాలైంది. బెంగళూరులోని సంస్థలపై ఐటీ అధికారులు దాడులు కూడా చేశారు. పన్నులు ఎగవేశారనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని బ్యాంకులు కూడా తమ అప్పులు చెల్లిం చడం లేదని చెప్పాయి. మొత్తంగా.. బైజూస్ ఎంత వేగంగా డెవలప్ అయిందో.. అంతే వేగంగా డౌన్ అయిం ది. దీంతో యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు బైజూస్ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
ప్రస్తుతం బైజూస్ పరిస్థితి ఏంటంటే.. సంస్థ డబ్బుకు కటకటలాడుతోంది. కనీసం వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈ విషయాన్నిప్రఖ్యాత సంస్థ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. సంస్థ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు బైజూస్ ఫౌండర్.. రవీంద్రన్.. బెంగళూరులోని తన ఇళ్లను అమ్మేశారట. ఆయనకు బెంగళూరులో విలాసవంతమైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని అమ్మినట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
అదేవిధంగా.. మరో విల్లా(నిర్మాణంలో ఉంది)ను కూడా తనఖా పెట్టినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. వీటి ద్వారా వచ్చిన సుమారు.. 12 మిలియన్ డాలర్లు(కోటీ 20 లక్షలు) ఉద్యోగుల వేతనాల కింద చెల్లించారని పేర్కొంది. మరోవైపు ఉద్యోగులు కూడా.. సంస్థ నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలువ స్తున్నాయి.