మనసు చంపుకోలేక.. పోటీని కాదనలేక.. చంద్రబాబు అంతర్మథనం!
ఇదే జరిగితే.. కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీకి సిద్ధమైన నాయకులను పక్కన పెట్టా ల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతర్మథనంలో పడ్డారా? మనసు చంపుకోలేక.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీని తట్టుకోలేక.. ఆయన తర్జన భర్జన పడుతున్నారా? అంటే ఔననే అంటు న్నారు పరిశీలకులు. జనసేన-టీడీపీ పొత్తు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇది కూడా వస్తే.. మొత్తం 175 స్థానాలను మూడు పార్టీలూ పంచుకోవాలి.
ఇదే జరిగితే.. కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీకి సిద్ధమైన నాయకులను పక్కన పెట్టా ల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరిని కాదనలేక, అలాగని వదులుకోలేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఇదాహరణకు.. పుట్టపర్తి నియోజకవర్గాన్ని జనసేన కోరుతోంది. కానీ, ఇక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంచి స్వింగ్‌లో ఉన్నారు. ఆయనను కాదని జనసేనకు టికెట్ ఇవ్వాలి. ఇక, తాడిపత్రి నియోజకవర్గం జేసీ బ్రదర్స్‌కు ఇచ్చి.. అనంతపురం పార్లమెంటును జనసేనకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది.
ఇది కూడా చంద్రబాబును ఇరకాటంలోనే పడేసింది. రాజమండ్రి రూరల్, సిటీ నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక, విజయవాడ పశ్చిమలో జనసేనకు టికెట్ దాదాపు ఖరారైందని అంటున్నా రు. దీంతో ఇక్కడ అప్పుడే అసంతృప్తులు పెల్లుబికాయి. తమకంటే తమకే టికెట్ కావాలని కోరుతున్నా రు. ఇక, మైలవరం టికెట్‌ను మరో ఎంపీ కుటుంబం కోరుకుంటోంది. కానీ, ఇక్కడ దేవినేని ఉమా ఉన్నా రు. ఇది సొంత పార్టీ వ్యవహారమే అయినా.. ఎంపీ పొరుగు పార్టీవైపు చూస్తున్నారు.
ఇక, కీలకమైన పత్తికొండ నియోజకవర్గాన్ని జనసేన కోరుతోంది. కానీ, ఇది టీడీపీ సీనియర్ నాయకుడు కేఈ కుటుంబానికి రిజర్వ్ చేసిన నియోజకవర్గం. కానీ, ఇది జనసేనకు కంచుకోటగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా నరసాపురం, ఉండి నియోజకవర్గాలు కూడా జనసేన ఖాతాలో నే ఉన్నాయి. వీటిపై కూడా ఒత్తిడి పెరిగింది.
అదేసమయంలో విజయవాడ తూర్పలో గద్దె రామ్మోహన్‌ను మార్చకపోతే.. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని పార్టీకి నివేదికలు వచ్చాయి. కానీ ఆయనను కాదంటే.. రెబల్‌గా మారే పరిస్తితి ఉంది. ఇలా.. దాదాపు 40 నుంచి 60 నియోజకవర్గాల్లో తన వారిని కాదనలేక.. అలాగని వచ్చే పోటీని తక్కువగా అంచనా వేయలేక.. చంద్రబాబు సతమతమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.