ఆయన ''నల్ల ఎంజీఆర్''.. నటనలో.. రాజకీయాల్లో

తెలుగు నాట నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఎంత ప్రసిద్ధుల్లో తమిళనాట మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (ఎంజీఆర్) అంతటి ప్రసిద్ధులు

Update: 2023-12-28 06:24 GMT

తెలుగు నాట నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఎంత ప్రసిద్ధుల్లో తమిళనాట మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (ఎంజీఆర్) అంతటి ప్రసిద్ధులు. ఎన్టీఆర్ కంటే ఆరేడేళ్లు పెద్దవారైన ఎంజీఆర్ నటన, రాజకీయాల్లో ఆయన కంటే కొద్దిగా ముందే అడుగుపెట్టారు. తమిళ ప్రజలకు అత్యంత ఆరాధ్యుడైన ఎంజీఆర్ సొంతంగా అన్నా డీఎంకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. 1977-87 మధ్య సీఎంగా పనిచేసిన ఆయన దక్షిణాది రాజకీయాల్లో ఆయన పెద్ద సంచలనం. ఓ విధంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఎంజీఆర్ ప్రేరణ. అయితే, 1987లో ఆయన అనూహ్య మరణం తమిళ ప్రజలను అత్యంత బాధించింది. ఆయన లేని లోటును తీర్చారు విజయ్ కాంత్.

అచ్చం అలానే..

ఎంజీఆర్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి, గ్రామీణ నేపథ్యం, ద్విపాత్రాభినయం ఇలా అన్నిట్లోనూ ముందుండేవారు. సరిగ్గా అలాంటి లక్షాణాలను విజయకాంత్‌ లో గమనించారు తమిళ ప్రజలు. ఎంజీఆర్ లా కమర్షియల్‌ చిత్రాల్లోనూ అదరగొట్టారు. ఇక విజయకాంత్ పారితోషికాన్ని ముందుగా తీసుకునేవారుకాదట. నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే అసలు తీసుకునేవారే కాదట. ఇక సినీ రంగంలో ఎంజీఆర్ తరహాలోనే సాగిన విజయకాంత్ రాజకీయాల్లోనూ ఆ ఒరవడి కొనసాగించారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా.. విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. అయితే ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి మంచి విజయాలు సాధించాయి. 'శివప్పు మల్లి' (ఎర్ర మల్లెలు రీమేక్‌), 'జదిక్కొరు నీధి' తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్‌లో ముందుగా ఆయన్ను 'పురట్చి కలైంజ్ఞర్‌' (విప్లవ కళాకారుడు) అనేవారు. తర్వాత అభిమానులంతా 'కెప్టెన్‌ విజయకాంత్‌' గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన వందో చిత్రం 'కెప్టెన్‌ ప్రభాకరన్' బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలించింది. ఇదే సినిమా తెలుగులో కెప్టెన్ ప్రభాకర్ గా విడుదలై దుమ్ము రేపింది.

అందుకే ఆ పేరు

ఎంజీఆర్ ఎర్రటి మేని ఛాయతో అందంగా ఉండేవారు. కానీ, విజయకాంత్ నలుపు. అయితే, తమిళుల సహజ రంగు అంది. ప్రితమ నట నాయకుడు ఎంజీఆర్ ను విజయకాంత్ లో చూసుకునేవారు. అందుకే ఆయనకు నల్ల ఎంజీఆర్ అనే పేరు వచ్చింది. కాగా, విజయకాంత్ పార్టీ డీఎండీకే (దేశీయ ద్రవిడ మర్పోక్కు మున్నేట్ర కజగం)కు ఓ ప్రత్యేకత ఉంది. 2006 ఎన్నికల్లో ఆయన ఒక్కడే గెలిచారు. కానీ, 2011 నాటికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేతో క‌లిసి విజయకాంత్ 41 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. 29 స్థానాల్లో గెలుపొంది, ప్ర‌తిప‌క్ష హోదాను పొందారు.

Tags:    

Similar News