దగ్గుబాటి ఫ్యామిలీపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు!
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ సహా దగ్గుబాటి కుటుంబ సభ్యులకు సంబందించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ సహా దగ్గుబాటి కుటుంబ సభ్యులకు సంబందించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా.. వెంకటేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో... దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరాం లపై కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది.
అవును... హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. టాలీవుడ్ ప్రముఖ హీరో, విక్టరీ వెంకటేష్ సహా దగ్గుబాటి కుంటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అటు ఇండస్ట్రీలోనూ, ఇటు బయటా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది!
ఈ క్రమంలో... నంద కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు... దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరాం లపై కేసు నమోదు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో... అసలు ఈ కేసు ఏమిటి.. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమిటి.. ఏయే సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారనేది ఇప్పుడు చూద్దాం!
నందకుమార్ అనే వ్యక్తి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... కోర్టు ఆదేశాలను దిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో... కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి, ఫర్నీచర్ మొత్తం ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. దీని వల్ల తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిల్మ్ నగర్ సీఐకి ఫిర్యాదు చేశారు నందకుమారు. దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు.. దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిపై కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో... ఐపీసీ 448, 452, 380, 506, 120బి సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నారని తెలుస్తుంది!