వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల కేసు... విచారణలో లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-16 04:54 GMT

వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించారు.. పవన్ చేసిన వ్యాఖ్యలు మనోవేదనకు గురి చేశాయని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం విజయవాడ కోర్టు ఆ విచారణను వాయిదా వేసింది.

అవును... వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసు విచారణను విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మహిళా వాలంటీర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన న్యాయస్థానం... తాజాగా సాక్ష్యుల స్టేట్ మెంట్స్ నీ రికార్డ్ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

కాగా వారహియాత్రలో భాగంగా ఏలూరు సభలో మైకందుకున్న పవన్ కల్యాణ్... ఏపీ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమని.. ఆ విషయాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు చెప్పాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.

గ్రామాల్లో ఉండే వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి? ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా? ఒంటరిగా ఉంటున్న మహిళలు ఎవరు? అనే విషయాలను సేకరించి ఆ సమాచారాన్ని సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ఇదే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయని, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పమన్నాయని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.... దీని వెనుక వైపీసీ పెద్దల హస్తం కూడా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన ఒక మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Tags:    

Similar News