ఈసారి చంద్రబాబు పవన్ కలసి ఢిల్లీకి...!

దాంతో ఏపీలో బీజేపీతో పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు చేసుకోవడానికి చంద్రబాబు పవన్ కలసి ఉమ్మడిగానే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

Update: 2024-02-28 14:33 GMT

తొందరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు అని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో పొత్తుల విషయంలో ఒక క్లారిటీ తీసుకుంటారు అని అంటున్నారు. ఇక బీజేపీ విషయం చూస్తే వచ్చే నెలలో ఆ పార్టీ తమ పార్టీ అభ్యర్ధుల తొలి విడత జాబితాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఏపీలో బీజేపీతో పొత్తులు పూర్తి స్థాయిలో ఖరారు చేసుకోవడానికి చంద్రబాబు పవన్ కలసి ఉమ్మడిగానే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

బీజేపీ విషయానికి వస్తే పొత్తులకు సుముఖంగానే ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏపీ పర్యటనలో తెలిసింది. దానితో పాటు అమిత్ షా తో బాబు చర్చల తరువాత కొంత సైలెంట్ వాతావరణం కనిపించినా బీజేపీ మాత్రం కూటమితోనే వెళ్ళాలని ఇప్పటికీ భావిస్తోంది అని అంటున్నారు.

ఈ క్రమంలో బీజేపీ ఎటూ మొగ్గుతోంది కాబట్టి పూర్తిగా ముగ్గులోకి లాకి తమ పక్షం అనిపించుకుంటే చాలు అన్నదే బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఏపీ వరకూ చూస్తే బీజేపీ గరిష్టంగా ఎనిమిది దాకా ఎంపీ సీట్లు కోరుతోందని అంటున్నారు.

ఆ లిస్ట్ కనుక చూస్తే అరకు, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం వంటివి ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో టీడీపీ సీట్లు కూడా కొన్ని ఉండడం విశేషం. అయితే బీజేపీ కోరిన వాటిలో కనీసంగా ఆరు దాకా ఎంపీ సీట్లు ఇచ్చి అయినా పొత్తును ఖరారు చేసుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

అదే విధంగా అసెంబ్లీ వరకూ చూస్తే బీజేపీని సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టాలన్నది టీడీపీ ఆలోచన. కానీ దానికి బీజేపీ నుంచి మాత్రం కొంత బేరసారాలు గట్టిగానే జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనీసంగా 2014లో ఇచ్చినట్లుగా 12 నుంచి 15 సీట్లు అయినా ఇవ్వాలని బీజేపీ కోరే వీలుంటుంది. దాని కంటే తగ్గకపోవచ్చు అని అంటున్నారు.

మరి ఈ పీటముడి తెగితేనే తప్ప ఈ మూడు పార్టీలు పొత్తులోకి రాలేవు. అయితే బీజేపీతో ఏదో విధంగా పొత్తులు కుదుర్చుకోవాలని పవన్ చంద్రబాబు ఇద్దరూ ఆలోచిస్తున్నారు కాబట్టి నంబర్ ఒకటి అటూ ఇటూ అయినా ఎక్కడో ఒక చోట తెగుతుందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే బీజేపీని కలుపుకున్న తరువాత మార్చి తొలి వారం నుంచి ఏపీలో టీడీపీ కూటమి ప్రచారం వేరే లెవెల్ లో సాగుతుంది అని అంటున్నారు. దానికి తగిన ఏర్పాట్లూ అన్నీ చేసుకునే బాబు పవన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు అన్నది లేటెస్ట్ టాక్.

Tags:    

Similar News