.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

సీరియస్ నోట్... పనిచేయకపోతే ముందస్తు పదవి విరమణ!

అవును... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతినెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) స్పష్టం చేసింది.

Update: 2024-06-29 06:26 GMT

తమ ఆదేశాలను పాటించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది. ఈ సందర్భంగా... అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్లు, కార్యాలయాలూ తమ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించి ప్రతీ నేల నివేదిక ఇవ్వాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) స్పష్టం చేసింది.

అవును... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతినెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) స్పష్టం చేసింది. ఆ నివేదికల ఆధారంగా... పనితీరు సరిగాలేని వారితో ముందస్తుగా పదవీ విరమణ చేయించే దిశగా కసరత్తు చేపట్టింది. దీంతో... ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.

ఇందులో భాగంగా... అన్ని మంత్రిత్వ శాఖలతోపాటు పీ.ఎస్.యూలు, బ్యాంకులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, చట్టబద్ధ వ్యవస్థల ఉన్నతాధికారులకు ఇప్పటికే నిబంధనలతో కూడిన ఆదేశాలను డీఓపీటీ పంపించింది. ఈ నేపథ్యంలో... ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును కాలానుగుణంగా సమీక్షించాలని.. వారిని సర్వీసుల్లో కొనసాగించాలా.. లేదా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సర్వీసు నుంచి రిటైర్మెంట్ చేయాలా అనే విషయంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది.

Read more!

ఈ క్రమంలో... పరిపాలనా మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని.. ఈ మేరకు డీఓపీటీ నివేదికను అందించాలని పదే పదే అభ్యర్థించినట్లు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వ్యూలో పేర్కొంది. ఈ మేరకు జూలై - 2024 నుంచి ప్రతీ నెల 15 తేదీలోగా అన్ని మంత్రిత్వ శాఖలు ఒక నిర్ధిష్టమైన ఫార్మెట్ లో నివేదికను అందించాలని కోరింది.

అన్ని స్థాయిల్లోనూ బాధ్యతాయుతమైన, సమర్ధవంతమైన పరిపాలనను అభివృద్ధి చెయడం ద్వారా పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వ విధుల్లో సమర్థతను పెంచడం సెంట్రల్ సివిల్ సర్విసెస్ (సీసీఎస్) లక్ష్యమని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తెలిపింది.

Tags:    

Similar News