'గంజాయి, చీప్ లిక్కర్ మినహా అన్ని వ్యాపారాలకు అనుమతులు'!

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే

Update: 2024-08-08 09:59 GMT

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటన చేస్తూ పలు కంపెనీల అధినేతలతో మాట్లాడుతున్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామం అని వివరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ విదేశీ పర్యటనలపై బీఆరెస్స్ నుంచి పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ స్పందించారు.

అవును.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో ఆ పదేళ్లలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి తెలంగాణకు ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... పదేళ్లలో ఎన్నిసార్లు కేటీఆర్ విదేశాలకు వెళ్లారు.. ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు అని ప్రశ్నించిన ఎంపీ చామల... గత ప్రభుత్వ హయాంలో తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వనరులను కాదని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని దుబ్బయట్టారు. ఫలితంగా రాష్ట్రాన్ని బీఆరెస్స్ సర్కార్ అప్పుల పాలుచేసిందని ఫైర్ అయ్యారు.

ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆరెస్స్ నేతలు నేడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని.. అసలు కాంగ్రెస్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా.. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లడించారు.

ఈ నేపథ్యంలోనే.. గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మినహా అన్ని వ్యాపారాలకూ తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు ఇస్తామని.. ఉద్యోగాలు కల్పించడమూ, రాష్ట్ర ఆదాయం పెంచడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News