పవన్ చేసిన మేలు ఎప్పటికీ మరచిపోను..ఎమోషన్ అయిన బాబు !
ఆయనకు ఈ రాజకీయాలు అవసరం లేదు కానీ ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చారు అని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చేసిన మేలు తాను కానీ టీడీపీ కానీ ఎప్పటికీ మరచిపోను అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎమోషన్ అయ్యారు తణుకులో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రచార సభలో ఆయన పవన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ సినీ రంగంలో కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకునే టాప్ హీరో అన్నారు. ఆయనకు ఈ రాజకీయాలు అవసరం లేదు కానీ ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చారు అని అన్నారు.
పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని బాబు ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు పర్సనల్ గా టార్గెట్ చేశారని ఎన్నో అవమానాలు ఆయన చూశారని అయినా ఆయన గట్టిగా నిలబడ్డారని అన్నారు అన్నింటికీ మించి తాను కష్టకాలంలో ఉన్నపుడు భేషరతుగా ముందుకు వచ్చి తమతో చేతులు కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన్ని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు.
ఏపీలో జగన్ పాలనను అంతం చేయాలని ఓట్ల చీలిక వద్దు అంటూ నినదించిన మొదటి నేత పవన్ అన్నారు. 2014లో ఏపీ అడ్డగోలు విభజనతో నష్టపోయింది అని బీజేపీ జనసేన టీడీపీ కూటమి కట్టాయని ఇపుడు జగన్ చేతులలో పడి రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయింది అని మూడు పార్టీలు మరోసారి చేతులు కలిపాయని చంద్రబాబు వివరించారు.
వైసీపీ పట్ల ప్రజలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వం పోవాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాగ్రహం తో వైసీపీ ప్రభుత్వం కుప్ప కూలుతుందని అలాగే జగన్ ఏకంగా లండన్ కి వెళ్ళిపోతారు అని ఆయన జోస్యం చెప్పారు.
జగన్ మీద కూడా చంద్రబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్ లండన్ కి వెళ్తాడు అంటూనే ఎక్కడికి వెళ్తాడో ఇపుడే చెప్పను చిప్పకూడు కూడా ఖాయమని హెచ్చరించడం విశేషం. జగన్ విషయంలో ఏమి చేయాలో నేనూ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తామని ఆయన కీలక కామెంట్స్ చేసారు.
ఏపీలో 2014 నాటి పాలన బాగా జరిగిందని చంద్రబాబు చెప్పుకున్నారు. మళ్ళీ అలాంటి పాలన రావాలంటే ప్రజలు కూటమికి ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు కోరారు. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు అధికారం అంతకంటే కాదు అని చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు.
నేను కానీ పవన్ కానీ ఆలోచించేది ప్రజల కోసమే అన్నారు. కూటమికి అధికారం అంటే ఏపీ బాగుపడాలన్నది అని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలను ఆయన ప్రజలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా చేసి చూపిస్తామని అన్నారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేయవద్దు, భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.