నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా.. వీరి పేర్లు క‌నిపిస్తాయా?

ఇక‌, గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ కూడా.. క‌ళ్లుకాయ‌లు కాచేలా ప‌ద‌వి కోసం చూస్తున్నారు.

Update: 2024-12-03 04:28 GMT

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపై మ‌రోసారి క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు జాబితాలు విడుద‌ల చేసిన కూట‌మి స‌ర్కారు... తొలిసారి 21 మంది, రెండో సారి 59 మందితో నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. రెండు సార్లు కూడా.. కొంద‌రికి అవ‌కాశం చిక్క‌లేదు. ప్ర‌ధానంగా టీడీపీ నుంచి చాలా మంది ఆశావ‌హులు ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ యంలో సీట్లు వ‌దులుకుని.. పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో కొంద‌రికి మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కు పోస్టులు ద‌క్కాయి. ద‌క్క‌ని వారు చాలా మంది ఎదురు చూస్తున్నారు.

తాజాగా మూడో నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చ‌ర్చించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్ద‌రు నాయ‌కులు.. అనేక అంశాల‌పై చ‌ర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్య‌వ హారం కూడా ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. గ‌త రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌కంటే.. కూడా టీడీపీ నేత‌ల‌కు ఎక్కు వగానే ప‌ద‌వులు ద‌క్కాయి. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు ఇంకా న్యాయం జ‌ర‌గ‌లేదంటూ.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా స‌హా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటివారు చెబుతున్నారు.

వీరికితోడు.. నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కూడా.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీని వీడి టీడీపీ బాట ప‌ట్టారు. అయితే... ఆయ‌న‌కు అప్ప‌ట్లో ఎమ్మెల్యే సీటు రాలేదు. దీంతో నామినేటెడ్ ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్నారు. గ‌త రెండు జాబితాల్లోనూ మేక‌పాటి పేరు క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడైనా త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు. ఇక‌, అనంత పురం జిల్లాకు చెందిన యామినీ బాల కుటుంబం కూడా.. నామినేటెడ్ పోస్టుల కోసం వెయిటింగ్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వైసీపీ బాట ప‌ట్టిన‌యామిని.. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి టీడీపీ లోకి వ‌చ్చారు. దీంతో ఆమె వెయిట్ చేస్తున్నారు.

ఇక‌, గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ కూడా.. క‌ళ్లుకాయ‌లు కాచేలా ప‌ద‌వి కోసం చూస్తున్నారు. ఈయ‌న ఈ ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్‌ను త్యాగం చేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వ‌ర్మ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. మొత్తంగా .. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీరంతా చంద్ర‌బాబు క‌రుణ కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ జాబితాలో అయినా న్యాయం జ‌రుగుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News