వారిని కట్టడి చేయాల్సిందే...బాబు హుకుం !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ బాధ్యతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు.
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ బాధ్యతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. అన్నీ తానై చూస్తూ వస్తున్నా పార్టీలో అంచెలంచెల విధానం ద్వారా మేలు చేయాలని చూస్తారు. అంతే కాదు తనతో పాటు పార్టీలో ముఖ్యులు కూడా పనిచేయాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరు.
ఇదిలా ఉంటే ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలన విషయంలో అంతా బాగానే ఉన్నా కొంత మంది ఎమ్మెల్యే తీరు వల్ల అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు కొందరు మీడియాకు ఎక్కి మాట్లాడుతున్న తీరుతో పార్టీ ట్రబుల్స్ ని ఫేస్ చేస్తోంది అని అంటున్నారు. రాయలసీమ జిల్లాలో ఒక సీనియర్ నేత ఆ విధంగా వ్యవహరించడం వల్ల పార్టీ కొంత ఇరకాటంలో పడింది.
అలాగే కొన్ని చోట్ల కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపించడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో తాజాగా జరిగిన జిల్లా ఇంచార్జి మంత్రులు ఎంపీల సమావేశంలో బాబు కీలక సూచన చేశారు అని అంటున్నారు.
జిల్లాలో ఎమ్మెల్యేలను వారి పనితీరుని గమనించాలని ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఆ బాధ్యతను ఇంచార్జి మంత్రులే వహించాలని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు అంతవరకూ రాకుండా ముందే చూసుకోవాలని ఆయన ఆదేశించారు. అంతే కాదు జిల్లాలో ఇంచార్జి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కో ఆర్డినేషన్ తో పనిచేయాలని కూడా బాబు దిశా నిర్దేశం చేశారు.
ఏ జిల్లాకు ఆ జిల్లా ఇంచార్జి మంత్రి అక్కడ ఉండే క్షేత్ర స్థాయి సమస్యలను చూసి పరిష్కరించాలని కూడా బాబు బాధ్యతలు అప్పగించారు. అంతా కలసి పార్టీని ఏక తాటిపై ఉంచేలా చూడాలని అన్నారు. ఇది చాలా అవసరమని కూడా బాబు గట్టిగానే చెబుతున్నారు.
సాధారణంగా అధికార పార్టీలో ఎమ్మెల్యేలను ఎంపీలకు మధ్యనే గ్యాప్ ఉంటుంది. అధికారాల విషయంలో వివాదాలు వస్తాయి. అలాగే పధకాలు కార్యక్రమాలు ప్రోటోకాల్ విషయంలో పొరపొచ్చాలు వస్తాయి. దాంతో అవి హద్దులు తాటితే వర్గ పోరుగా మారుతుంది. వైసీపీ అయిదేళ్ళ పాలనలో అదే జరిగింది.
దాంతో టీడీపీ ఇపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి ఎంపీ వస్తారు. ఆయన మొత్తం ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండాలి. అయితే ఎమ్మెల్యేలు ఎంపీని తమ పరిధిలోకి రాకుండా చూసుకుంటారు. అక్కడే వస్తోంది వివాదం. దీంతోనే బాబు ఈ విధంగా ఆదేశించారు అని అంటున్నారు.
ఇక క్షేత్ర స్థాయిలో కూడా అనేక విషయాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల జోక్యం ఉండాల్సిన చోట ఉండకూడని చోట అని రెండు రకాలుగా బాధ్యతలు ఉంటాయి. వీటిని కూడా ఇంచార్జి మంత్రులు గమనించి వారిని దారికి తేవాల్సిన బాధ్యతలను బాబు అప్పగించారు అని అంటున్నారు.
ఇక ఇంచార్జి మంత్రులకు ఎంపీలకు కూడా బాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించడం విశేషం. ఆయన ప్రకటించిన ర్యాంకులలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయని తెలుస్తొంది.
అంతే కాదు సామాజిక మాధ్యమాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని బాబు మంత్రులను కోరారు. ఆ విషయంలో నంద్యాలకు చెందిన మంత్రి ఫరూక్ వెనకబడడంతో ఇక మీదట జోరు చూపించాలని బాబు కోరారని అంటున్నారు. అదే విధంగా జిల్లా ఇంచార్జి మంత్రులు ఎంపీల సమావేశానికి రాని ఎంపీల మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. పార్టీ పనుల కంటే ఏవీ ముఖ్యం కాదని ఆయన గట్టిగా చెప్పారని అంటున్నారు.