ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మితే ఎంత భారీ ఫైన్ అంటే?

అంతేకాదు.. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్మే వారిపై మొదటి తప్పు కింద రూ.5 లక్షల భారీ ఫైన్ వేయాలని డిసైడ్ అయ్యారు.

Update: 2024-10-29 08:30 GMT

ఎక్కువగా అమ్మే వారి తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రావటం ఒక ఎత్తు అయితే..ఇదే అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఎక్కడా తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని తేల్చేసిన చంద్రబాబు.. ఎమ్మార్పీ ధర కంటే రూపాయి ఎక్కువకు అమ్మినా ఊరుకునేది లేదని తేల్చేశారు. అంతేకాదు.. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్మే వారిపై మొదటి తప్పు కింద రూ.5 లక్షల భారీ ఫైన్ వేయాలని డిసైడ్ అయ్యారు.

ఒకవేళ ఆ తర్వాత కూడా వారి తీరులో మార్పు రాకుంటే.. ఏకంగా వారి లైసెన్సులను రద్దు చేసేందుకు సైతం వెనుకాడమని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టు షాపుల్ని ఉపేక్షించేది లేదన్న ఏపీ ర.. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి మద్యం షాపు వద్ద సీసీ కెమేరాలు.. ధరల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతో అక్రమాలకు కళ్లెం వేయాలని సూచన చేశారు. ఇసుక విషయంలోనూ ఇదే తీరును ఫాలో అవుతామన్న చంద్రబాబు.. మద్యం ధరలతో ప్రజల జేబులకు గుల్ల చేసేలా ఎవరూ వ్యవహరించకూడదని సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. మరి.. ముఖ్యమంత్రి ఆదేశం ఎంతలా అమలవుతుందో చూడాలి.

Tags:    

Similar News