చంద్రబాబు మరోసారి మాస్ వార్నింగ్.. కామెంట్స్ వైరల్!

ఈ నేపథ్యంలో ప్రతి నెలా చంద్రబాబు స్వయంగా పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Update: 2024-11-30 11:40 GMT

ఒకటో తేదీ సెలవు రోజు అయితే.. దానికి ఒక రోజు ముందే ఏపీలో పెన్షన్స్ అందచేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదూరిన తర్వాత పూర్తి స్థాయిలో అమలైన పథకంగా సామాజిక పెన్షన్స్ కి పేరుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా చంద్రబాబు స్వయంగా పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు ఏమీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా నేమకల్లులో పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. పింఛన్లు పంపిణీ చేసి, లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. అనంతపురం జిల్లాలోని నేమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అనంతరం జరిగిన గ్రామసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా... అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని అన్నారు. రాయసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత తాము తీసుకుంటామని చంద్రబాబు తాజాగా కీలక హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో... పింఛన్ల పంపిణీలో పైసా కూడా అవినీతి జరగకూడదని గట్టిగా చెప్పామని చెప్పిన చంద్రబాబు.. కష్టపడి పనిచేసి సంపద పెంచుతామని.. దాన్ని పేదలకు పంచుతామని అన్నారు. అదేవిధంగా... పేదలకు అనేక రకాలుగా మేలు చేయాలని ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 198 అన్న క్యాంటీన్లు ఉన్నాయని బాబు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారని.. అయితే తాము వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో మత్తుపదార్థాల నిర్మూలనకు "ఈగల్" పేరుతో డేగకన్ను ఉంచామని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, గంజాయి మాఫియా లేకుండా చేస్తామని చంద్రబాబు తెలిపారు.

ఇదే క్రమంలో... ఎవరైనా గంజాయి అమ్మినా, పండించినా అదే మీకు చివరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు... ఆంజనేయస్వామి సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందని.. అంతా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News