వైరల్ పిక్: దావోస్ లో టీమిండియా... కెప్టెన్ చంద్రబాబు!
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమ తమ బృందాలతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమ తమ బృందాలతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య హెల్తీ కాంపెటీషన్ నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఓ పిక్ హల్ చల్ చేస్తుంది.
అవును... దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ లో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకుని, మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం తెలిసిందే. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జ్యూరిచ్ లో తెలుగు వెలుగు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.
ఈ సమయంలో మరో ఆసక్తికర పిక్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... ఒకే ఫ్రేమ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారు. వీరంతా దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు.
దేశం మొత్తం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టే విధంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... వీరి మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో టీమిండియా అని క్యాప్షన్ పెట్టగా... చంద్రబాబు, ఫడ్నవీస్ తో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో భాగంగా రౌండ్ టేబుల్ చర్చ సందర్భంగా ఈ ఫోటో అంటూ రేవంత్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.