తన బాస్ ఎవరో సీక్రెట్ చెప్పిన చంద్రబాబు!

అవును కానీ చంద్రబాబు లాంటి దిగ్గజ రాజకీయ నేతకు ఎవరు బాస్ ఉంటారు అన్న డౌట్లు అందరిలోనూ ఉంటాయి.

Update: 2024-10-26 04:11 GMT

అవును కానీ చంద్రబాబు లాంటి దిగ్గజ రాజకీయ నేతకు ఎవరు బాస్ ఉంటారు అన్న డౌట్లు అందరిలోనూ ఉంటాయి. చంద్రబాబు అంటేనే పాలనాదక్షుడు అని అంటారు. కాలానికి కూడా క్లాస్ చెప్పగల దిట్ట అని కూడా అంటారు. ఇక ఎత్తులు వ్యూహాలలో బాబు చాణక్యుడికే పాఠాలు చెబుతారు అని కూడా అంటారు.

అలా ఎంతో ఎత్తుకు ఎదిగి రాజకీయంగా తనకంటూ రికార్డులు ఎన్నో క్రియేట్ చేసుకున్న ఉద్దండ పిండం చంద్రబాబుకు బాస్ ఉంటారా అంటే మనకు ఇప్పటి దాకా ఆ సీక్రెట్ తెలియదు. కానీ దానిని ఎవరో చెప్పలేదు. స్వయంగా చంద్రబాబే రివీల్ చేశారు. తనకు బాస్ ఒకరు ఉన్నారని బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు బయటపెట్టారు.

ఈ టాక్ షో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. బాలయ్య అయితే తన చిలిపితనంతో చంద్రబాబుని బావగారు అంటూ కొంత సరదాయే చేశారు. ఆయన అడిగిన అనేక కొంటె ప్రశ్నలకు బాబు కూడా చాలా చమత్కారంతో సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ షోలో స్క్రీన్ మీద రెండు ఫోటోలు బాలయ్య వేసి మీ ఇంట్లో ఎవరు బాస్ అని చిలిపిగా అడిగారు.

స్క్రీన్ మీద వేసిన ఆ రెండు ఫోటోలలో ఒకటి భువనేశ్వరి, రెండవది బ్రాహ్మణిది. దానిని చూసిన బాబు నవ్వుతూనే చాలా తమాషాగా బదులిచ్చారు. భువనేశ్వరి నాకు బాస్ అయితే బ్రాహ్మణి మా లోకేష్ కి బాస్ అని చెప్పారు. ఆ ఇద్దరే తమ ఇంటికి బాసులు అని చెప్పకనే చెప్పేశారు దానికి బాలయ్య బదులిస్తూ అవును మేము వారిని అలా ట్రైనింగ్ ఇచ్చి పంపించామని నవ్వుతారు. మొత్తానికి బాలయ్య బాబులోని మరో కోణాన్ని కూడా ఈ షో ద్వారా బయటపెట్టారు. అదేంటి అంటే సరదాల బాబుని.

బాబుని షోకి పిలుస్తూనే ఒక బుక్ తెచ్చి ప్రమాణం చేయమంటారు. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రేమతో సమాధానాలు ఇస్తామని కూడా చెప్పమంటారు. దానికి బాబు ఒట్టు పెడతాను అని అంటూ బాలయ్య నెత్తి మీదనే చేయి వేసి ఆయనకే ఖంగు తినిపిస్తారు. ఇక మీరు చిలిపిగా సరదాగా ఇబ్బంది పెడదామనుకుంటే నేను చమత్కరంతో తిప్పికొడతాను అని కూడా అంటారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఒక బావ బావమరిది మధ్యన జరిగిన సరదా సంభాషణగానూ సాగింది, ఒక ప్రముఖ నటుడు ఒక సీనియర్ పొలిటీషియన్ మధ్యన జరిగిన అసక్తికర చర్చగానూ ఉంది. నందమూరి నారా కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రతినిధుల మధ్య సాగిన ఆసక్తికరమైన సంభాషణగానూ అనిపించింది. ఈ షో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. దాని అంచనాలను కూడా అందుకుంది అని అంటున్నారు.

Tags:    

Similar News