చంద్రబాబు తప్పించుకోలేరు.. కారణాలు ఇవే..!
``పరిస్థితి తెలిసి కూడా తనకు తానే తీసుకున్న గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారం టే ఆయన చంద్రబాబే``ఇది ఎవరో అన్నమాట కాదు..
''పరిస్థితి తెలిసి కూడా తనకు తానే తీసుకున్న గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారం టే ఆయన చంద్రబాబే'' ఇది ఎవరో అన్నమాట కాదు.. ఆ పార్టీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి, ఒక మీడియా అధినేత అన్న మాట. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగు తోంది. నిన్న మొన్నటి వరకు వీటిని మేనేజ్ చేయగలిగారు. రాష్ట్రం అప్పల్లో ఉందని.. వైసీపీ ఊడ్చేసిం దని ఇలా ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఎమ్మెల్యేలు.. ఎక్కడకు వెళ్లినా.. సూపర్ సిక్స్ గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు.. సీఎం చం ద్రబాబునే ఇటీవల ఓ మహిళ పార్టీ కార్యాలయంలో కలిసి తమ బాబుకు తల్లి వందనం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు .. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌ను ఎట్టి పరిస్థితిలోనూ అమలు చేసి తీరుతామని చెప్పారు. కానీదీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎప్పటి నుంచి అమలు చేసేదీ ఆయన వెల్లడించలేదు.
కానీ, అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా ఆయా ఎన్నికల హామీలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి ప్రజల మధ్య కూడా చర్చ జోరుగానే సాగుతోంది. బహుశ తనకు పెద్దగా ఈ హామీలతో సంబంధం లేక పోయినా.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ హామీలపై తాజాగా జరిగిన వారాహి బహిరంగ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తానికి సాధారణ ప్రజల నాడి ఎలా ఉందనేది చంద్రబాబు సర్కారుకు తెలిసిపోయింది.
ఈ క్రమంలో ఇప్పుడు ఇక, ఎన్ని చెప్పినా చంద్రబాబు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏటా పిల్లల కోసం జగన్ ఇచ్చిన అమ్మ ఒడిని చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తానని చెప్పారు. అంతేకాదు.. ఎంత మంది ఉన్నా ఇస్తానన్నారు. సో.. తొలి ఏడాది ఏదో ఒక రూపంలో తప్పించుకునేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు కనీసం ఒక్క బిడ్డకైనా.. గతంలో జగన్ అమలు చేసినట్టుగా అమలు చేయాలని కూటమి సర్కారు భావిస్తోంది.
అదేవిధంగా ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివి కూడా వెంటాడుతున్నాయి. ఎవరూ అడగకపోయినా.. దసరా నుంచి మూడు సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కానీ, ఆయన మరిచిపోయినా.. ప్రజలు మాత్రం ఇతర కీలక పథకాలను మాత్రం కెలికేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు క్షేత్రస్థాయిలో వీటిపైనే ఎక్కువగా వినతులు వస్తుండడం గమనార్హం.