నారా లోకేష్ వారసత్వంపై వాదనెందుకు 'తమ్ముడూ ?'
మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్‌ను ప్రొజెక్టు చేసే క్రమంలో కొందరు టీడీపీ నేతలు.. ఆయనను వారసుడిగా ప్రచారం చేస్తున్నారు.
మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్‌ను ప్రొజెక్టు చేసే క్రమంలో కొందరు టీడీపీ నేతలు.. ఆయనను వారసుడిగా ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబుకు వారసుడు కాబట్టి.. ఆయన తర్వాత ఈయనే పార్టీ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం అనే వాదన తెరమీదికి వచ్చింది. వాస్తవానికి బీజేపీతో చెలిమి చేస్తున్న చంద్రబాబుకు.. వారసత్వ రాజకీయాలంటే పెద్దగా పడవు. అందుకే.. వారసులకు టికెట్ లు ఇచ్చేది లేదని.. గతంలోనూ ఆయన ప్రకటించారు.
కానీ, తప్పని సరి పరిస్థితిలో కొందరికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తన కుమారుడు.. పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ విషయానికి వస్తే.. ఆయన పార్టీ కోసం పనిచేస్తున్న తీరును గమనించిన తర్వాతే.. మంగళగిరి టికెట్‌ను 2019లో ఆఫర్ చేశారు. దీనికి ముందు.. కూడా ఆయనను మంత్రిగా తీసుకున్నా.. అప్పటికే పార్టీకి అందించిన సేవలు, 2014లో పార్టీ అధికారం దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలో నారా లోకేష్ పాత్రను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు.
ఇక, గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేయడంతో పాటు.. పెద్ద ఎత్తున పార్టీని ముందుండి నడిపించారు. ఈ పరిణామాల క్రమంలో నారా లోకేష్ తనను తాను మలుచుకునే ప్రయత్నం చేశారు. ఆయనను యువ నాయకుడిగా నిరూపించుకునేందుకు అనేక కష్టాలకు ఓర్చారు. ఇది సంపూర్ణ నాయకుడిగా మలిచి.. మంత్రివర్గంలోనూ చోటు దక్కేలా చేసింది. కట్ చేస్తే..ఇప్పుడు పార్టీలోనూ మరింత కీలకంగా మారనున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.
అయితే.. ఈ క్రమంలోనే నారా కుటుంబానికి వారసుడు కాబట్టే.. ఇలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోం ది. దీనిపై తాజాగా స్పందించిన సీఎం చంద్రబాబు.. వారసత్వం ఎక్కువగా పనిచేయదని.. కష్టం-వ్యూహం . ప్రజల కోసం నిలబడుతున్నారన్న వారినే ప్రజలు మెచ్చి.. ఎంచుకుంటారని పరోక్షంగా లోకేష్ భవిష్య త్తుపై చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు అయింది. సో.. నారా లోకేష్ వారసుడు కాదు.. స్వయం కృషితోనే రాజకీయంగా ఎదుగుతున్నాడన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది. దీనిని బట్టి తమ్ముళ్లు ఇక, వారసుడు అనే ప్రచారాన్ని ఆపేస్తారో లేదో చూడాలి.