రేవంత్ - బాబు: న‌దుల అనుసంధానంతోనే జ‌ల వివాదాల‌కు ఫుల్ స్టాప్‌..!

త‌ద్వారా.. జ‌ల వివాదాలు.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రింత కాక రేపుతున్నాయి.

Update: 2024-07-07 17:43 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల విభ‌జ‌న‌, అప్పుల విభ‌జ‌న అనేది ఒక చిన్న అంశం మాత్ర‌మే. ఒక ర‌కంగా చెప్పాలంటే.. వీటిని ఎప్ప‌టికైనా ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంది. కానీ, ఎటొచ్చీ.. ఏటా మూడ సార్లు తెర‌మీదికి వ‌చ్చే జ‌ల వివాదాల విష‌యంలోనే.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కూడా వివా దం నెల‌కొంది. ఈ వివాదం కేంద్రం కూడా ప‌రిష్క‌రించ‌లేని స్థాయిలో ఉంది. కృష్ణాన‌ది ప్ర‌వాహంలో త‌మ వాటాను ఏపీతో స‌మానంగా లేదా.. ఏపీకంటే కూడా ఎక్కువ‌గా ఇవ్వాల‌న్న‌ది తెలంగాణ డిమాండ్‌.

అంతేకాదు.. కృష్ణాన‌దిపై ఎక్క‌డా ప్రాజెక్టులు క‌ట్ట‌రాద‌న్న‌ది కూడా.. తెలంగాణ నినాదం. అయితే.. ఇది సాధ్యం కాదు. పైగా మ‌హారాష్ట్ర‌కు స‌హ‌క‌రిస్తున్న తెలంగాణ‌.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. కృష్ణా న‌ది నీటిపై వివాదంతోనే ముందుకు సాగుతోంది. మ‌రోవైపు.. గోదావ‌రి జ‌లాల విష‌యంలో మాత్రం భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. గోదావ‌రిపై తాము ఎన్న‌యినా.. ప్రాజెక్టులు క‌ట్టుకుంటామ‌ని.. ఆపేందుకు మీరెవ‌రు? అంటూ.. గ‌తంలో కేసీఆర్ ప్ర‌శ్నించారు.

త‌ద్వారా.. జ‌ల వివాదాలు.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రింత కాక రేపుతున్నాయి. ఇలాంటి స‌మ యంలో జోక్యానికి కేంద్రం కూడా స‌హ‌క‌రించ‌డం లేదు. అందుకే.. అస‌లు మొత్తం కీల‌క ప్రాజెక్టుల‌ను తామే తీసుకుని నిర్వ‌హిస్తామంటూ..జ‌గ‌న్ హ‌యాంలో కేంద్రం తేల్చి చెప్పింది. దీనికి అయ్యే నిధుల‌ను ఉభ‌య రాష్ట్రాలూ జ‌మ చేయాల‌ని కూడా కోరింది. అంతేకాదు.. అప్ప‌టిక‌ప్పుడు.. ఇరు రాష్ట్రాలూ చెరో 200 కోట్ల‌ను జమ చేయాలంది. అయిన‌ప్ప‌టికీ.. ఈ వివాదం స‌మ‌సిపోలేదు.

ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు మేలైన సూచ‌న చేశారు. న‌దుల అనుసంధానం ద్వారా.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ద‌క్షిణాదిలో కృష్ణా, గోదావ‌రి నదుల‌పై ఆధార‌ప‌డిన రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని , త‌ద్వారా.. సముద్రంలోకి పోతున్న వృథానీటిని వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా.. ఆయ‌న చెప్పారు. దీనిని తెలంగాణ ఆమోదిస్తే.. ఆదిశ‌గా అడుగులు వేస్తే.. జ‌ల వివాదాల‌కు తెర‌ప‌డుతుంది. లేక‌పోతే.. మ‌రిన్ని సంవ‌త్స‌రాలు.. గిర్రున తిరుగుతాయే కానీ.. స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉంటాయి.

Tags:    

Similar News