సర్వే రాళ్ల కోసం.. గెలాక్సీ గ్రానైట్: జగన్ దుబారాపై చంద్రబాబు కామెంట్స్
ఏపీలో వైసీపీ పాలనలో ప్రజా ధనాన్ని ఏ విధంగా దుబారా చేశారనే విషయంపై సీఎం చంద్రబాబు తాజా గా వివరించారు.
ఏపీలో వైసీపీ పాలనలో ప్రజా ధనాన్ని ఏ విధంగా దుబారా చేశారనే విషయంపై సీఎం చంద్రబాబు తాజా గా వివరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఫొటోల పిచ్చి.. ఆయన చేసి న విచ్చలవిడి ఖర్చులను వివరించారు. భూముల సర్వే చేపట్టిన తర్వాత.. సరిహద్దుల్లో పాతేందుకు రా ళ్లు కొనుగోలు చేశారని.. అయితే.. ఇవి అలాంటి ఇలాంటి గ్రానైట్ రాయికాదని.. ఉన్నతస్థాయి వర్గాలు ఇళ్ల లో వేసుకునే గెలాక్సీ గ్రానైట్ అని చంద్రబాబు వివరించారు.
ఇలాంటి రాళ్లను పొలాల్లో పాతేందుకు ఎవరైనా కొంటారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. జగన్ ఫొటోలు వేయడం ఏంటని నిలదీశారు. ప్రజల ఆస్తులు, పేదల ఆస్తులపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఎందుకుని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఎప్పుడూ ఇలా ప్రజల ఆస్తులు, వారి హక్కు పత్రాలపై తాను ఫొటోలు వేసుకోలేదన్నారు. వ్యవస్థలనే కాకుండా రాష్ట్ర ఖజానాను కూడా జగన్ ఎలా విధ్వంసం చేసిందీ 7 శ్వేత పత్రాల రూపంలో వివరించామన్నారు.
ఇక, రాష్ట్రం ప్రస్తుతం 15 లక్షల కోట్లరూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు వివరించారు. 2014 విభజన సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయని.. అయితే.. వాటికంటే, 2019 తరువాత వచ్చిన చేతకాని పాలన వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. తాము నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లలో వస్తున్న ప్రజా సమస్యల్లో సగానికి పైగా భూ సమస్యలే ఎక్కువ వున్నాయని తెలిపారు. ఎంత విచ్చలవిడిగా భూదందాలు చేసారో దీనిని బట్టి అర్థమవుతోందన్నారు.
ఈ విషయాలను ముందుగానే గుర్తించి.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తొలి సంతకంలోనే రద్దు చేసామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇలాంటి విచ్చలవిడి తనం పనికిరాదని.. 14 ఏళ్ల తనసర్వీసులో ఇలాంటి తరహాలో ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్రాన్ని ఇప్పుడు గాడిలో పెట్టాల్సి ఉందని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు.