చంద్రబాబు లెక్క మారిందా ?!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది.

Update: 2024-07-05 05:28 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. 2014లో బీజేపీతో కలిసి ఉన్నా అప్పుడు టీడీపీ మద్దతు లేకున్నా బీజేపీకి ఇబ్బంది లేకున్నది. ఈసారి టీడీపీ మద్దతు కీలకం కావడంతో చంద్రబాబు ప్రాధాన్యత పెరిగింది.

ప్రధాని మోదీతో 30 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి సాయం చేయాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర మంత్రులతోనూ కలిసి ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై చర్చించారు. జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఐదేళ్లలో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఇప్పటికే ఈ రెండు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం కూడా ప్రాజెక్టులు, నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు.

గతానికి భిన్నంగా ఈసారి కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్దికి బాటలు వేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎన్‌డీఏలో మరో కీలక భాగస్వామి, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు బీహార్‌ విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. బీహార్ కు ప్రత్యేకహోదా వస్తే ఏపీకి కూడా ఇస్తారని బాబు భావిస్తున్నారు. నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేకహోదా విషయంలో ఈసారి చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News

eac