చిత్తూరుపై చంద్రబాబు మార్క్.. ఈ ఇద్దరు రెడ్లకు చుక్కలు!
వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నాయకులు చేసిన దూకుడు పనులకు సీఎం చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు.
వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నాయకులు చేసిన దూకుడు పనులకు సీఎం చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. అది కూడా చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుపైనే లెక్కలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు పరోక్షంగా చెక్ పెడుతున్నారు. వీరిద్దరే.. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని.. ఆయనకు చుక్కలు చూపిస్తామని శపథాలు చేశారు. అయితే.. అలాంటిదేమీ జరగలేదు. కానీ, ఇప్పు డు వారే చుక్కలు చూసే పనిలో పడ్డారు. దీనికి కారణం.. చంద్రబాబు మార్కు వ్యూహాత్మక నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నా యి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, చిత్తూరు నగరం, పలమనేరు, మదనపల్లె, పీలేరు, కాణిపాకం, బంగారుపాళ్యం, తవణంపల్లె ప్రాంతాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డిలు పంచుకు న్నారు. దీంతో వారి బినామీల ద్వారా.. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయించారు. అంతేకాదు.. ఈ వ్యాపారంలోకి మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా చేర్చుకుని.. ``మళ్లీ వచ్చేది మన సర్కారే`` అంటూ వారిని నమ్మబలికి భారీగా పెట్టుబడులు పెట్టించారు. దీంతో అంతా నిజమే అనుకున్న వారు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేశారు. వీటిలో కొన్ని అసైన్డ్, అటవీ భూములు కూడా ఉన్నాయన్నది తాజా సర్కారు తేల్చిన లెక్క.
ఆయా వెంచర్లు ఇంకా పూర్తిగా నిర్మాణాలకు నోచు కోలేదు. ఎందుకంటే.. ఇదంతా ఎన్నికలకు కేవలం ఆరు మాసాల ముందు మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కులు వేసి.. అమ్మకాలకు రెడీ చేశారు. ముందస్తు విక్రయాలు చేపట్టి.. మధ్యతరగతి జీవుల నుంచి సొమ్ములు సేకరించే ప్లాన్ వేశారు. కానీ, పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో కూటమి సర్కారు పగ్గాలు చేపట్టాక.. అక్రమ లేఅవుట్లను అంతమొందించే పనికి శ్రీకారం చుట్టింది. దీంతో పంచాయితీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వేసిన ఈ లేఔట్లు వేశారు.
వీటిని గుర్తించిన ప్రభుత్వం వెంచర్లలో ``ఈ భూమి మాది`` అంటూ సర్కారు బోర్డులు పెట్టింది. అంతేకాదు.. వీటిని కొనేవారు జాగ్రత్త పడాలని కూడా హెచ్చరించింది. ఈ పరిణామంతో ఇప్పుడు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి తర్జన భర్జన పడుతున్నారు. తమ బినామీలు కేసుల్లో ఇరుక్కుంటే.. తమ లోపాలు బయట పడతాయని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇచ్చిన షాక్‌తో ఇద్దరు రెడ్లు.. తల్లడిల్లుతుండడం గమనార్హం.