జగన్ ని ఫాలో అంటున్న బాబు...ఏ విషయంలో...!?
దీని వల్ల ప్రతీ ఎన్నికకూ అవే ముఖాలు కనిపిస్తున్నాయి. జనాలకు అది కొన్ని చోట్ల నచ్చడంలేదు అని అంటున్నారు.
ఏపీ సీఎం జగన్ ను చంద్రబాబు ఒక విషయంలో ఫాలో కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారుట. జగన్ వరసబెట్టి సిట్టింగులను మార్చేస్తున్నారు. అంతే కాదు అక్కడ కొత్త ముఖాలను తెచ్చి పెడుతున్నారు. పార్టీలో అసంతృప్తి ఉన్నా కూడా ఈ ప్రయోగం అంతిమంగా మంచి ఫలితాలు ఇస్తుంది అనే అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపిస్తూ తామే ప్రతీసారి అని పోటీకి సిద్ధపడుతున్న వారి విషయంలో అధినాయకత్వాలు కూడా అలాగే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి.
దీని వల్ల ప్రతీ ఎన్నికకూ అవే ముఖాలు కనిపిస్తున్నాయి. జనాలకు అది కొన్ని చోట్ల నచ్చడంలేదు అని అంటున్నారు. ఫలితాలు అలాగే వస్తున్నాయి. కొత్త వారిని పెట్టిన చోట మంచి రిజల్ట్స్ వచ్చాయని రీసెంట్ గా జరిగిన తెలంగాణా ఎన్నికలు నిరూపించాయి. దాంతో వైసీపీ ధైర్యంగా ఆ పనికి సిద్ధపడింది.
వైసీపీ అయితే రెండు ఎన్నికల్లోనే టికెట్లు ఇచ్చింది. అయినా మార్చేస్తోంది. టీడీపీ నలభయ్యేళ్ళ హిస్టరీ ఉన్న పార్టీ. ఆ పార్టీ అనేక ఎన్నికల్లో టికెట్లు ఇస్తూ పోతోంది. టీడీపీ చాలా మంది నాయకులు ఎనిమిది తొమ్మిది సార్లు పోటీ చేసిన వారు ఉన్నారు. పదోసారికి కూడా వారు రెడీ అవుతున్నారు. కాదూ అంటే తమ వారసులను ముందుకు తెస్తున్నారు.
అయితే చంద్రబాబు ఈసారి తన మైండ్ సెట్ మార్చుకుంటున్నారు అని అంటున్నారు. ఎపుడూ వారేనా అన్న జనాల చింతను తీర్చడంతో పాటు టీడీపీకి యూత్ ఫ్లేవర్ అద్దాలని చూస్తున్నారు. దాంతో చాలా మంది సీనియర్ల టికెట్లు తెగిపోతాయని అంటున్నారు. అదే సీట్లలోకి కొత్తవారు వస్తారని అంటున్నారు. ఈసారి టీడీపీ తరఫున పోటీకి ఎన్నారైలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అంగబలం అర్ధబలం కలిగిన వారు కూడా తాము సై అంటున్నారు.
తెలుగుదేశం 1999లో మంచి ప్రయోగం చేసింది. న్యూట్రల్ గా ఉన్న వారిని విద్యావంతులను రాజకీయ నేపధ్యం పెద్దగా లేని వారిని తెచ్చి ఎంపిక చేసింది. దాంతో వారు ఎక్కువగా గెలిచారు ఈసారి కూడా అలాంటి ప్రయోగమే చేయవచ్చు అని అంటున్నారు.అందుకే సీనియర్లకు చెక్ చెప్పాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే టీడీపీలో దశాబ్దాల పాటు ఉంటూ పాతుకుపోయిన వారిని మార్చడం కాదనడం అంత ఈజీగా అయ్యే పనేనా అన్న చర్చ వస్తోంది. కానీ వైసీపీలో అదే రకమైన ప్రయోగం చేశారు. పైగా టికెట్లు మార్చినా వైసీపీ జాబితా ముందే బయటకు వస్తుంది కాబట్టి ఎవరూ ఆ పార్టీలో చేరే చాన్స్ అయితే లేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఈ విషయంలో జగన్ ని ఫాలో అవుతారు అని అంటున్నారు. నిజంగా అదే జరిగితే మాత్రం ఏపీలో అటూ ఇటూ కూడా కొత్త అభ్యర్ధులను జనాలు చూడవచ్చు. ఏపీ రాజకీయం రంగు పూర్తిగా మారిపోతుందని అంటున్నారు.