జగన్ లేని చాన్స్ కొట్టేసిన చంద్రబాబు.. ఏం చేస్తారు?
ప్లీజ్-ప్లీజ్-ప్లీజ్.. అనడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.. అని జగన్ వ్యాఖ్యానించా రు.
2019లో వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ ప్రజలు 151 సీట్లు వచ్చాయి. దీంతో ఆయన ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారని అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం.. రావాల్సినవి సాధిస్తారని కూడా ఏపీ ప్రజలు భావించారు. కానీ, వీటి విషయంలో జగన్ చేతులు ఎత్తేశారు. గెలిచిన తర్వాత.. తొలి రోజే ఆయన కేంద్రంలో బలమైన పార్టీ అధికారంలోకి రాకుండా చూశామని.. కానీ, వచ్చిందని.. కాబట్టి బ్రతిమాలు కోవడం తప్ప ఏమీ చేయలేమన్నారు..
ప్లీజ్-ప్లీజ్-ప్లీజ్.. అనడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.. అని జగన్ వ్యాఖ్యానించా రు. ప్రస్తుతం వచ్చిన ట్రెండ్స్‌ను గమనిస్తే.. ప్రజలు ఈ ప్లీజ్‌ను తిరిగికొట్టారు. అంతేకాదు.. కేంద్రంపై పోరాడే శక్తి కూడా లేదని గుర్తించారు. అందుకే.. ఇప్పుడు ఏకపక్షంగా టీడీపీ కి అధికారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు కీలకమైన బాధ్యత చంద్రబాబు వైపు వచ్చింది. అయితే.. ఇక్కడ చంద్రబాబు కూడా కీలక రోల్ పోషించే అవకాశం వచ్చింది.
ఎందుకంటే.. కేంద్రంలో అప్పట్లో మోడీ సర్కారు ఏకంగా 303 సీట్లతో ఏకపక్ష విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. పొరుగు పార్టీలతోనూ.. మిత్రపక్షాలతోనూ.. కలిసి ఉండాల్సిన పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. కానీ, ఇప్పడు కేంద్రంలో పరిస్థితి కూడా మారిపోయింది. కేంద్రంలో మోడీ సర్కారు కు ఆశించిన మేరకు సీట్లు రావడం లేదు. ఎన్డీయే కూటమికి మొత్తంగా 295 సీట్లు మాత్రమే వచ్చాయి.
వీటిలో బీజేపీ కేవలం 130 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు అక్కడ మద్ద తు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ఏపీకి సంబంధించి అంశాలపై ప్రశ్నించే అవకాశం వచ్చింది. సాధించే అవకాశం కూడా వచ్చింది. అప్పట్లో జగన్‌కు రాని పెద్ద ఛాన్స్ చంద్రబాబుకు వచ్చింది. మరి ఏం చేస్తారో.. ఏం సాధిస్తారో చూడాలి.