ఏపీకి అర్జెంట్ గా రూ.10వేల కోట్లు కావాలి.. ఎందుకంటే?

దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసినఅప్పులు.. నిధుల సమీకరణ తలకు మించిన భారంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

Update: 2024-06-20 05:22 GMT

ఎన్నికల్లో లభించిన చారిత్రక ఘన విజయం వరకు బాగానే ఉన్నా.. ఏపీ ప్రభుత్వాన్ని నడిపే విషయంలో చంద్రబాబు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితే. దీనికి తోడు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామాల్ని వెంటనే అమలు చేయాల్సి ఉండటంతో పాటు.. ఉద్యోగులకు నెల మొదటి రోజునే జీతాలు ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో ఇప్పుడు పరిస్థితి మరింత టైట్ గా మారినట్లు చెబుతున్నారు. దీనికి తోడు గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసినఅప్పులు.. నిధుల సమీకరణ తలకు మించిన భారంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోజులై 1 నాటికి ఏపీ సర్కారుకు అర్జెంట్ గా రూ.10వేల కోట్లు అవసరమన్న విషయాన్ని తేల్చారు. దీన్ని ఎలా సమీకరించాలన్న దానిపై సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలకు తగ్గట్లు పెంచిన పింఛన్ల మొత్తాన్ని జులై 1న ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ల బకాయిల్ని జులై ఒకటిన చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీని కోసమే రూ.4408.31 కోట్లు అవసరమని తేల్చారు. వీటితో పాటు మొదటి తేదీనే జీతాలు.. ప్రభుత్వ పెన్షన్ దారులు కూడా తమకు ఒకటో తేదీనే చెల్లింపులు జరుపుతారన్న ఆశలు పెట్టుకున్నారు.

దీంతో.. వీరందరి ఆశలు.ఆకాంక్షలు తీర్చాలంటే ఏపీ సర్కారుకు రూ.10వేల కోట్లు అవసరమని లెక్క తేల్చారు. మరోవైపు జగన్ సర్కారు.. ఓట్ల లెక్కింపు రోజు కూడా రూ.4వేల కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నారు. దీంతో.. ఏప్రిల్ నుంచి జూన్ 4 వరకు తీసుకున్న రుణం రూ.25వేల కోట్లుగా తేల్చారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకే ఇంత భారీగా రుణం తీసుకోవటంతో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరంగా మారింది.

కేంద్రం నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకు తీసుకునే రుణపరిమితిని నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లకు రూ.47వేల కోట్లు తీసుకునే వీలుంది. అయితే.. జగన్ సర్కారు ఇప్పటికే రూ.25 వేల కోట్లు సమీకరించింది. అంటే.. సెప్టెంబరు వరకు మరో రూ.22 వేల కోట్లు మాత్రమే తీసుకునే వీలుంది. దీంతో.. అవసరమైన నిధుల కోసం చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News