వైసీపీకి నో టెన్షన్...బాబు షాకింగ్ డెసిషన్...!?
టీడీపీ అధినేత చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం కూడా జరుగుతోంది
టీడీపీ అధినేత చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం కూడా జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్ధిని నిలబెడుతుంది అని ఇప్పటిదాకా ఒక స్థాయిలో ప్రచారం సాగింది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోంది ఏంటంటే బాబు రాజ్యసభ ఎన్నికల నుంచి వెనక్కి వెళ్తున్నారు. దానికి రకరకాలైన కారణాలతో పాటు ఇది కూడా బాబు మరో వ్యూహం అని అంటున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభయ్ర్ధి గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి లెక్క ప్రకారం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు అవసరం పడతారు. గత ఏడాది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఫలితాలలో బోల్తా పడిన నేపధ్యం నుంచి జగన్ పాఠాలు నేర్చుకున్నారు. దాంతో ఆయన అలెర్ట్ అయ్యారు. అందుకే వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కత్తి వేలాడుతోంది.
మరో వైపు టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలను పిలిచి జగన్ కొందరికి నచ్చచెబుతున్నారు. మరి కొందరి విషయంలో మాత్రం సీనియర్లకు అప్పగిస్తున్నారు. ఇలా అసంతృప్తిని వైసీపీ చాలా వరకూ తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంకో వైపు చూస్తే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసే వ్యూహంలో భాగంగా వారికి అనేక రకాలైన ప్రలోభాలు కూడా కల్పించాలి.
కొందరికి టికెట్లు కూడా ఇవ్వాలి. ఇప్పటికే జనసేనతో పొత్తులో భాగంగా సీట్లు టీడీపీకి తగ్గుతున్నాయి. మరి కొన్ని సీట్లు బీజేపీతో పొత్తు విషయం తేలితే పోతాయి. అలా టీడీపీ శిబిరం ఇప్పటికే టైట్ గా ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి అకామిడేట్ చేస్తూ పోతే అది మరింతగా ఇబ్బంది వస్తుంది పార్టీ కోసం కష్టపడిన సొంత పార్టీ వారికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది.
ఇది పార్టీ లోపలి విషయం అయితే వైసీపీని ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను తీసుకుని గెలిపించుకున్నా జనంలో చెడు సంకేతాలు వెళ్తాయని వైసీపీ దాన్ని జనం ముందు పెట్టి టీడీపీతో ఒక రేంజిలో ఆట ఆడుకుంటుందని భావిస్తున్నారు. ఇది టీడీపీకి ఎక్కువ కలవరపెట్టే అంశం. ఎన్నికలు ముంగిట పెట్టుకుని ఈ రకంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేయడం వల్ల టీడీపీకే తీరని నష్టం వాటిల్లుతుందని కూడా భావించే టీడీపీ అధినాయకత్వం వెనక్కి తగ్గుతోంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ టీడీపీ, బీజేపీ నుంచి ఒక్కో సభ్యుడు రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు. బలాబలాలు చూసుకుంటే వైసీపీ సునాయాసంగా ఈ మూడు సీట్లు గెలుచుకుంటుంది. అంటే తాను కోల్పోయిన సీటుని తిరిగి దక్కించుకోవడమే కాదు, టీడీపీ బీజేపీ ఎంపీల సీట్లను కూడా ఆ పార్టీ గెలుచుకుంటుంది. ఈ రోజున చూస్తే కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే టీడీపీకి ఉన్నారు. మరోసారి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాకపోతే పూర్తి స్థాయిలో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం పోయినట్లే.
అయినా సరే టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సాహసించడంలేదు. దానికి కారణం గెలుపు భయాలతో పాటు ప్రలోభాల నింద మోయడం ఎన్నికల వేళ ఎందుకు అన్న ఆలోచనలే అని అంటున్నారు ఏది ఏమైనా కూడా టీడీపీ రాజ్యసభ రేసు నుంచి తప్పుకోవచ్చు అని అంటున్నారు.
అదే సమయంలో వైసీపీ తన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. దాంతో టీడీపీ వెనకడుగు వేసింది అన్నది నిజమైతే మాత్రం వైసీపీ కి నో టెన్షన్ అని చెప్పవచ్చు. హ్యాపీగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులూ ఏకగ్రీవంగా నెగ్గేస్తారు. అపుడు ఈ నెల 27న ఎన్నికల దాకా ఆగకుండా ఫలితం తెలిసిపోతుంది అంటున్నారు.