నోట్ల రద్దు : చంద్రబాబు సంచలనం !

‘‘నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తేనే అవినీతి తగ్గుతుంది. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలి.

Update: 2024-07-10 05:46 GMT

‘‘నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తేనే అవినీతి తగ్గుతుంది. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. డిజిటలైజేషన్ పూర్తి స్థాయిలో జరగాలి. బ్యాంకులు వంద శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయ రంగానికి, సంపద సృష్టించే రంగాలకు ప్రోత్సాహం అందించేలా బ్యాంకులు పనిచేయాలని, కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందించే పరిస్థితి రావాలని, దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పేదరికం నిర్మూలన, యువతకు నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఏపీలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని, వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. నోట్ల రద్దు అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, నోట్ల వాడకం తగ్గించి డిజిటల్ లావాదేవీలను బ్యాంకులు ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. దీని వల్ల డబ్బులు ఏ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతున్నాయో ట్రాక్ చేసేందుకు సులువుగా ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News