కేంద్రంలో ట్రిపుల్ ఎన్ సర్కార్ ?

ఎందుకంటే అందులో ఎన్డీయే భాగస్వాములు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది కాబట్టి.

Update: 2024-06-07 20:44 GMT

ట్రిపుల్ ఆర్ మూవీ సూపర్ హిట్. అప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ పాపులర్ అయింది. ఎవరైనా మూడు ఆర్ తో కలిపి పేరు ఉంటే వారిని షార్ట్ కట్ లో ట్రిపుల్ ఆర్ అని పిలవడం అలవాటు అయిపోయింది. అయితే ఈసారి కేంద్రంలో ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎన్డీయే ప్రభుత్వం అని పిలుస్తారు. ఎందుకంటే అందులో ఎన్డీయే భాగస్వాములు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది కాబట్టి.

అలా ఎన్డీయే సర్కార్ అని పిలుచుకోవచ్చు. కానీ ట్రిపుల్ ఎన్ సర్కార్ అని దీనికి కొత్త పేరు పెట్టేస్తున్నారు. ట్రిపుల్ ఎన్ ఏంటి అంటే అక్కడే ఉంది అసలు స్టోరీ. ట్రిపుల్ ఎన్ లలో ఒక ఎన్ అంటే నరేంద్ర మోడీ మరో ఎన్ అంటే నాయుడు అదే మన చంద్రబాబు నాయుడు. మూడవ ఎన్ నితీష్ కుమార్ బీహారీ బాబు.

ఈ ముగ్గురూ కలిస్తేనే ఏర్పడిన సర్కార్ కాబట్టి దీనిని ట్రిపుల్ ఎన్ సర్కార్ అని అపుడే జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని సెటైరికల్ గా కాంగ్రెస్ కూడా విమర్శిస్తూ ప్రచారం చేస్తోంది. నరేంద్ర నాయుడు నితీష్ సర్కార్ ఏర్పడుతుంది ఇది ఎంతకాలం ఉంటుందో అని కాంగ్రెస్ అపుడే అప శకునం పలుకుతోంది.

ట్రిపుల్ ఎన్ సర్కార్ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అంటున్నారు. ఈ ప్రభుత్వం ముచ్చటగా గద్దెనెక్కినా ఎంతకాలం ఉంటుంది అన్నది చూడాలని అంటున్నారు. మోడీ మూడోసారి ప్రధాని అవుతారేమో కానీ పూర్తి కాలం ఉండలేరు అని కూడా కాంగ్రెస్ అంటోంది.

దానికి కారణం బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం మద్దతు ఇస్తున్న నాయుడు నితీష్ ల వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉండడమే అని అంటున్నారు. నితీష్ ఎపుడు ఏ వైపు ఉంటారో ఎవరికి తెలుసు అని అంటున్నారు. ఆయనకు ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ఉప ప్రధాని ఆఫర్ ఉంది. ఇంకా డిమాండ్ చేస్తే ప్రధాని ఆఫర్ అయినా ఇస్తారేమో.

అయితే వెయిట్ అండ్ సీ అన్న ఆలోచనలో ఆయన ముందుగా మోడీ వైపే ఉన్నారు. మోడీని వీడి పోను అంటున్నారు. ఎన్డీయే పక్ష సమావేశంలో మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నితీష్. ఇక నాయుడు కూడా అంతే చంద్రబాబు నాయుడు అయితే మోడీని విజనరీ అని కొనియాడుతున్నారు ఆయన లేని దేశాన్ని ఊహించలేమని అంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ ఎక్కడైనా తేడా వస్తే ఆ ఊతకర్రలు కాస్తా నాయుడు నితీష్ లాగేసుకుంటే అపుడు ట్రిపుల్ ఎన్ సర్కార్ ఏమవుతుంది అన్నది అందరికీ తెలిసిందే. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని కాంగ్రెస్ అంటోంది. తాము ఈ టెర్మ్ లోనే అధికారంలోకి వస్తామని 230 సీట్లకు పాగా వేసిన ఇండియా కూటమి గట్టిగానే చెబుతోంది. మొత్తానికి ఈ నెల 9న కేంద్రంలో ఏర్పడబోయేది మాత్రం ట్రిపుల్ ఎన్ సర్కార్ అన్న మాట. మోడీతో పాటు నాయుడు నితీష్ కేంద్ర ప్రభుత్వం స్టీరింగ్ ని పట్టుకుంటున్నారు. మరి ఎవరు ఏ వైపు తీసుకుని వెళ్తారు అన్నది చూడాలని విపక్ష శిబిరం అంటోంది.

Tags:    

Similar News