బాబును అడ్డు పెట్టి.. క‌మ్మ ఓట్ల‌కు గేలం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట‌యి.. జైల్లో ఉండి.. దాదాపు 50 రోజులు దాటింది. అయితే, ఇన్ని రోజులుగా స్పందించ‌ని తెలంగా ణ అధికార పార్టీ నాయ‌కులు.. తాజాగా ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు.

Update: 2023-10-30 04:22 GMT

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట‌యి.. జైల్లో ఉండి.. దాదాపు 50 రోజులు దాటింది. అయితే, ఇన్ని రోజులుగా స్పందించ‌ని తెలంగా ణ అధికార పార్టీ నాయ‌కులు.. తాజాగా ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి టీడీపీ త‌ప్పుకొన్న త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెంచింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుపై ఎక్క‌డా లేని సానుభూతిని బీఆర్ ఎస్ నాయ‌కులు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీని వెనుక తెలంగాణ‌లోని క‌మ్మ వారి ఓట్లు స‌హా.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును కూడా త‌మ‌వైపు తిప్పుకొనే వ్యూహం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మంత్రి కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు అరెస్టుపై స్పందించారు. అంత పెద్దాయ‌నను అరెస్టు చేయ‌డం స‌రికాద‌ని వ్యాక్యానించారు. ఇక‌, ఆయ‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత కూడా స్పందించిన విష‌యం తెలిసిందే. బాబు అరెస్టును ఆమె దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నేత‌, తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి కూడా చంద్ర‌బాబు అరెస్టును ఖండించారు. అంతేకాదు.. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న అరెస్టును అక్ర‌మ‌మ‌ని అంటున్నార‌ని.. దీనిని తాము కూడా న‌మ్ముతున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

చంద్ర‌బాబును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోచారం శ్రీనివాస‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లా వర్నిలో ఏర్పాటుచేసిన కమ్మ వారి ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. చంద్ర‌బాబు చాలా సీనియ‌ర్ నాయ‌కుడని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాంటి నాయ‌కుడిని ఇలా నిర్బంధించ‌డం రాజ‌కీయ క‌క్ష‌లో భాగ‌మేన‌ని చెప్పారు. అయితే.. బీఆర్ ఎస్ నాయ‌కులు ఇలా వ‌రుస‌గా చంద్ర‌బాబుపై సానుభూతి ప‌వ‌నాలు కురిపించ‌డం వెనుక క‌మ్మ వ‌ర్గానికి గేలం వేస్తున్నార‌నే వాద‌న ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. మ‌రోవైపు.. కాంగ్రెస్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు అరెస్టుపై స్పందించ‌లేదు

Tags:    

Similar News