ఢిల్లీ నుంచే యుద్ధం మొద‌లు.. బాబు వ్యూహం

చంద్రబాబుకు కేసుల విష‌యం మ‌రింత ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై సీఐడీ దాఖలు చేసిన పీటి వారెంట్లను ఏసీబీ కోర్టు తాజాగా తోసిపుచ్చింది

Update: 2023-12-05 07:55 GMT

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న యుద్ధాన్ని ఢిల్లీ నుంచే ప్రారంభిస్తున్నారు. ఈనెల 7న ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ చంద్రబాబు ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జీరో డోర్ నెంబ‌రులోనూ వంద‌ల కొద్దీ ఓట్లు ఉన్న విష‌యాన్నివారు చెబుతున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో త‌మ‌కు సానుకూల ప‌రిణామాలు రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు నేరుగా ఢిల్లీలోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.

మ‌రోవైపు.. ఈ నెల 11 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఈ నెల 11న శ్రీకాకు ళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖ‌రారైంది. వాస్త‌వా నికి మంగ‌ళ‌వారం నుంచే ఈ ప‌ర్య‌ట‌న‌లు సాగాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. తుఫాను కార‌ణంగా వాయిదా వేసుకున్నారు. ఇక‌, 11 నుంచి జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ఆత్మ‌గౌర‌వ నినాదంతో తిరిగి యాత్ర‌లు చేయ‌నున్నారు.

చంద్ర‌బాబుకు ఊర‌ట‌..

చంద్రబాబుకు కేసుల విష‌యం మ‌రింత ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై సీఐడీ దాఖలు చేసిన పీటి వారెంట్లను ఏసీబీ కోర్టు తాజాగా తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని ఏపీ సీఐడీ అధికారులు వారెంట్లు దాఖలు చేశారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని పేర్కొంటూ కోర్టు ఈ వారెంట్ల‌ను తోసిపుచ్చింది.

తుఫాను సాయం..

మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు అవసరమైన చోట్ల నాయకులు, కార్యకర్తలు తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News