బర్త్ డే విషెస్ లోనూ అక్కసు : ఇదేం తీరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...!?
దీని మీద చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు కూడా. ఒక సీఎం ని గ్రీట్ చేసే విధానం ఇదేనా అని కూడా అంటున్నారు
ఒక ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన కోట్లాది మందికి ప్రతినిధి. ఆ సంగతి ఎవరికైనా తెలియదు అనుకుంటే ఏమో కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియదు అని ఎవరైనా అనుకోగలరా. అంటే అన్నీ తెలిసే జగన్ కి బర్త్ డే విషెస్ ని అలా ఏకవచనంతో చెబుతారా అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది
జగన్ పుట్టిన రోజు వేళ దేశమంతా ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. అందరూ కూడా గౌరవ వచనంతో జగన్ కి గ్రీటింగ్స్ చెబితే రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ అంటూ ఏకవచనంతో గ్రీట్ చేయడమే చర్చనీయాంశం అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీని మీద చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు కూడా. ఒక సీఎం ని గ్రీట్ చేసే విధానం ఇదేనా అని కూడా అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు ఎలా గ్రీట్ చేశారో చూస్తే కనుక హపీ బర్త్ డే వైఎస్ జగన్ అని. అంటే జగన్ ని ఆయన పూర్తిగా ఏక వచనంతో అగౌరపరచారు అనే అంటున్నారు.
సభా మర్యాద అని ఒకటి ఉంటుంది. అలాగే అధికార మర్యాద ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో కచ్చితంగా అన్నీ తనకు ఉండాలని భావించే చంద్రబాబు ఇలా చేయడం తగునా అంటున్నారు. నిన్నటికి నిన్న జరిగిన యువగళం సభలో తన కుమారుడు నారా లోకేష్ ని సైతం లోకేష్ గారూ అని సంబోధించిన చంద్రబాబుకు సీఎం జగన్ ని మాత్రం ఏకవచనంతో ఎలా పిలవాలని అనిపించింది అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
అయితే జగన్ని తక్కువ చేసి అలా ఏకవచనంతో సంభోదించినా కూడా జగన్ మాత్రం రిప్లై ఇస్తూ థాంక్యూ సీబీఎన్ గారూ అని చెప్పడం ఆయన సంస్కారం ఆయన మర్యాదతనం అని అంటున్నారు. ఇది కూడా నెటిజన్లు గుర్తు చేస్తూ చంద్రబాబు ఇది కదా నేర్చుకోవాల్సింది అంటున్నారు.
ఇక జగన్ పుట్టిన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ గారూ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జగన్ జీ అన్నారు. సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున జగన్ గారూ అంటే అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ కూడా జగన్ గారూ అని సంభోదించారు. మరి ఇంతమంది పెద్దలు ఇలా సీఎం జగన్ని గౌరవిస్తూంటే చంద్రబాబు మాత్రమే ఇలా ఏక వచన ప్రయోగం చేయడం ఆయనకు జగన్ పట్ల ఉన్న అక్కసు తెలియచేస్తోంది అని కూడా నెటిజన్లు అంటున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉంటారు శత్రువులు ఉండరని యువగళం సభలో నీతి వాక్యాలు పలికిన చంద్రబాబు తాను మాత్రం జగన్ విషయంలో అదే విధంగా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే సీబీఎన్ సంస్కారం అది అయితే జగన్ సంస్కారం ఇది అని అంతా చర్చించుకుంటున్నారు. మరి చంద్రబాబు తీరు ఇకనైనా మారదా అన్నదే అంతా అంటున్న మాట ని కూడా పేర్కొంటున్న నేపధ్యం ఉంది.