చంద్రబాబు చోద్యం.. పార్టీకి ఇంత డ్యామేజా...!
టీడీపీ అధినేత, ఫార్టీ ఫైవ్(45) ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని ఒక పట్టాన తేల్చరనే పేరుంది
టీడీపీ అధినేత, ఫార్టీ ఫైవ్(45) ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని ఒక పట్టాన తేల్చరనే పేరుంది. అది ప్రభుత్వమే అయినా.. పార్టీ అయినా.. ఆయన ఒక నిర్ణయం తీసుకునేందుకు అనేక ఈక్వేషన్లు చూసుకుంటారని పేరు. ఒక మాటలో చెప్పాలంటే. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే చేసేది. నాయకులు, నాయకులు కొట్టుకున్నా.. పట్టించుకునేది కాదు. నాయకులు విసిగి వేసారి పోయాక.. అప్పుడు రంగంలోకి దిగి నిర్ణయం ప్రకటించేది. దీంతో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో నష్టపోయింది.
ఇటీవల రాజస్థాన్‌లో పార్టీ నష్టపోవడానికి అశోక్ గెహ్లాత్‌తో యువ నాయకుడు సిందియాకు ఏర్పడిన పొరపొచ్చాలే. వీటిని ఆదిలోనే సమసిపోయేలా చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇలానే.. ఇప్పటికీ టీడీపీ వ్యవహరిస్తోందనే వాదన ఉంది. చంద్రబాబు చోద్యం చూస్తారు.. ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు వేచి చూస్తారనే వాదన ఉండనే ఉంది. అయితే.. ఇది ఒకప్పుడు చెల్లిందేమో. కానీ, ఇప్పుడు కాలం వాయు వేగ మనోవేగాలతో పరుగు పెడుతోంది.
ఈ సమయంలో చంద్రబాబు పార్టీ పరంగా చోటు చేసుకున్న వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే.. చాలా వరకు మంచిదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఎన్నికలకు ముందు.. చంద్రబాబు అనుసరించే విధానాలు చాలా ఇంపార్టెంట్. షార్ప్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీసుకోకపోవడంతోనే విజజయవాడ రాజకీయం రచ్చకు వచ్చింది. ఇప్పుడు పెనమలూరు లోనూ అదే పరిస్థితి నెలకొంది.
టికెట్ తనదేనని అనుకున్న బోడే ప్రసాద్.. త్వరలోన పార్టీలోకి వస్తారని భావిస్తున్న కొలుసు పార్థసారథి వర్గాల మధ్య పోరు పెరిగిపోయింది. ఇక, శ్రీకాకుళం జిల్లా రాజాంలోనూ టికెట్ ఆశించిన గ్రీష్మకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఇంచార్జిగా పార్టీ మాజీ మంత్రి కోండ్రు మురళిని నియమించింది. టికెట్ ఆయనకే ఇస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఇక్కడ కూడా.. గ్రీష్మ పొగపెడుతున్నారు. ఇక, అనంతపురం అర్బన్‌ను జనసేన కు ఇస్తారని.. ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.
దీంతో యాక్టివ్ ఉన్న ప్రభాకర్‌చౌదరి నియాక్టివ్ అయ్యారు. తాడికొండలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 25 - 30 నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులు టీడీపీ పరిస్థితి ఉంది. దీనిని వెంటనే సరిచేయడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చని.. చోద్యం చూస్తే కుదరదని సీనియర్లు అంటున్నారు.