బాబు బెయిల్ సంబరాల్లో పసుపు మీడియా... నెటిజన్ల సెటైర్స్ పీక్స్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఇటీవల మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-21 11:14 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఇటీవల మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. కంటికి ఆపరేషన్, చర్మ వ్యాదులు మొదలైన అనారోగ్య సమస్యల కారణాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. బాబుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ అన్నీ చంద్రబాబు పక్కాగా పాటించారా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ క్రమంలో తాజాగా హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

అంతవరకూ బాగానే ఉంది కానీ... ఈ సందర్భంగా మీడియా అన్న విషయం మరిచిపోయి ఒకవర్గం మీడియా చేసిన హడావిడి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. వచ్చింది బెయిలే తప్ప... విచారణ అనంతరం తీర్పు కాదు కదా.. ఆమాత్రం బెసిక్ లేకుండా ఇలా ఎలా..? అనే కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. వీరి అత్యుత్సాహం చూసి ఒకానొకదశలో స్కిల్ స్కాం కేసును కోర్టు కొట్టేసిందా? అనే అనుమానం కూడా పలువురికి కలగడం గమనార్హం. అంటే... ఆ రేంజ్ లో ఉందన్నమాట ఆ మీడియా పెర్ఫార్మెన్స్!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో కడిగిన ముత్యంలా బయటకు రాలేదు..! హెల్త్ బాగా లేదని, గుండె సైజు పెరిగిందని మొదలైన కారణాలను కూడా చెప్పుకుంటూ బెయిల్ సంపాదించుకున్న పరిస్థితి! అయితే కంటికి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చిన బాబు ఇంతలోనే గుండె సైజు పెరిగిందని చెప్పగానే... ఎయింస్ వంటి సంస్థల రిపోర్ట్స్ ని రిఫర్ చేసి తీసుకుని ఉంటే బాగుండేదనే కామెంట్లూ వినిపించాయి. ఏది ఏమైనా... ఏది ఎలా జరిగినా... చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంపై జరిగిన రచ్చ మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి

కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే... ఈ కేసులో చంద్రబాబు అవినీతి చేయలేదని కోర్టు చెప్పలేదు! ఇదే సమయంలో ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టం చేసింది. మరోపక్క ఇప్పటికే సీఐడీ కూడా దాదాపు 140 వరకూ ఆధారాలు సేకరించినట్లు కోర్టులు పేర్కొంది. అయినప్పటికీ.. రెగ్యులర్ బెయిల్ అనే మాటపట్టుకుని ఒక వర్గం మీడియా చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇది గుడ్ న్యూస్ గా కంటే... సర్ ప్రైజ్ గా భావించినట్లున్నారని... ఇప్పట్లో దొరకదనుకున్న బెయిల్ ఉన్నపలంగా దొరికేటప్పటికీ కంట్రోల్ తప్పినట్లున్నారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

బాబు బెయిల్ పై సుప్రీం కోర్టులో అప్పీల్:

చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని పిటిషన్‌ లో పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ పలు అంశాల్లో హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని అంటున్నారు.

దర్యాప్తునకు సహకరించకుండానే ఆధారాలు చూపలేదంటే ఎలా..

స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని.. అయితే ఇది తొందరపాటు చర్యగా భావిస్తున్నామని ఏపీ సీఐడీ చెబుతుంది! ఈ కేసుకు సంబంధించి టీడీపీ నుంచి ఏ ఒక్కరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదని.. సీఐడీ అడిగిన సమాచారం ఇప్పటివరకూ ఇవ్వలేదని.. ఆ విధంగా దర్యాప్తుకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేసినప్పటికీ.. ఆ డబ్బు టీడీపీ ఖాతాకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుంది అంటూ సీఐడీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

ఇదే సమయంలో ఈ కేసులో చంద్రబాబును ఏరకంగా బాధ్యుడ్ని చేస్తారంటూ బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. ఈ స్కాంలో కుట్రకోణం అత్యంత కీలకమైనదని.. నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా చట్టం ఆ విషయాన్ని తీవ్రంగానే చూస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు కోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ అభిప్రాయపడుతూ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది!

Tags:    

Similar News