అమరావతిపై చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తో కలిసి పాల్గొన్నారు.

Update: 2024-01-14 06:24 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా బోగి మంటల కాంతులతో పల్లెలన్నీ వెలిగిపోతున్నాయి. సంక్రాంతి ముగ్గులతో మురిసిపోతున్నాయి. ఈ క్రమంలో అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన "తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... సంక్రాంతి సంబరాల్లో భాగంగా మందడం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వచ్చే రోజుల్లో అమరావతి కేంద్రంగా రాజధానిగా పరిపాలనతో పాటు అభివృద్ధి కూడా మొదలవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధాని అన్ని నొక్కివక్కాణించారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా... వైసీపీ ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వేశారు.

ఇదే క్రమంలో... ఈ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని వ్యాఖ్యానించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే అమరావతే ఏపీ రాజధాని అని చంద్రబాబు పునరుధ్గాటించారు. ఇందులో భాగంగా... "మన రాజధాని అమరావతే. ఇది ఆంధ్రప్రదేశ్‌ ను సస్యశ్యామలం చేస్తుంది. భవిష్యత్తు మనది.. తప్పకుండా అమరావతే కేంద్రంగా, మన రాజధానిగా ఇక్కడనుంచే పరిపాలనకే కాదు అభివృద్ధికి కూ

Tags:    

Similar News