అయ్యన్న గంటా ఇష్యూ.. ఆలా తేల్చనున్న బాబు...?

అది కూడా ఢిల్లీ దారి చూపిస్తున్నారుట. ఒంగోలు నుంచి ఎంపీగా గంటాను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని అంటున్నారు

Update: 2023-08-06 03:15 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రాజకీయ చిచ్చుతో టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. ఇది 2004 నుంచి అలా జరుగుతూనే ఉంది. ఎవరూ తగ్గరు. ఇద్దరూ గట్టివారే. దాంతో చంద్రబాబు ఇద్దరికీ నచ్చచెప్పినా పరిస్థితి అయితే మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కొనసాగుతున్నా మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య రాజకీయ వైరం అలా కంటిన్యూ అవుతూనే ఉంది

ఇదిలా ఉంటే 2024 ఎన్నికలు చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతీ ఓటూ ప్రతీ సీటూ ప్రాణప్రదం అని ఆయన భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ నేతల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించరు అని అంటున్నారు అందుకే ఆయన ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు అని అంటున్నారు

వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రెండు జిల్లాలలో టీడీపీకి లబ్దిని చేకూర్చే ప్లాన్ వేశారు అని అంటున్నారు. గంటాను ఏకంగా ఒంగోలు కి షిఫ్ట్ చేయబోతున్నారు అన్నది 'లేటెస్ట్ హాటెస్ట్ న్యూస్. ఇప్పటిదాకా అది ప్రచారంగా ఉన్నా ఇపుడు కన్ ఫర్మ్ అని అంటున్నారు.

గంటా విశాఖకు ఉపాధి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఒక సారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఏడేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూడా కొత్త నియోజకవర్గం చూసుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు విశాఖలో సీటు చూపించడంలేదు, ఏకంగా ఆరు జిల్లాలను దాటించి ఒంగోలులో సీటు కేటాయిస్తున్నారు అని టాక్

అది కూడా ఢిల్లీ దారి చూపిస్తున్నారుట. ఒంగోలు నుంచి ఎంపీగా గంటాను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ఒంగోలులో టీడీపీకి బాగానే పట్టు ఉంది. జగన్ వేవ్ లో సైతం నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవడానికి ఒంగోలు ఎంపీ గా గంటాను బరిలోకి దించబోతున్నారుట.

అలా కనుక చేస్తే ఆయన పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ గెలుస్తుందని బాబు భారీ స్కెచ్ వేశారు అని అంటున్నారు. అంతే కాదు గంటా సామాజికవర్గం కూడా ఒంగోలులో ఉంది. దాంతో ఆయన అభ్యర్ధి అయితే వారంతా టర్న్ అవుతారు అని అంటున్నారు. గంటాది ఒంగోలులోని కొండెపి నియోజకవర్గం.

దాంతో గంటాను విశాఖ రాజకీయాల నుంచి తప్పించి ఒంగోలులో సెటిల్ కావాలని బాబు ఆదేశించారు అని అంటున్నారు. ఇక విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి పూర్తి బాధ్యతలు అప్పగించి అందరినీ కో ఆర్డినేట్ చేసుకోమని చెప్పబోతున్నారుట. ఈ పరిణామం అయ్యన్న వర్గీయులలో ఆనందం కలిగిస్తూంటే గంటా వర్గంలో కలవరం రేగుతోంది.

విశాఖ జిల్లా రాజకీయాలో పట్టు సాధించి ఉత్తరాంధ్రా దాకా తన పలుకుబడిని విస్తరించుకున్న గంటా ఒక్కసారిగా అన్నీ విడిచి ఒంగోలుకు వెళ్తారా అన్నది పెద్ద ప్రశ్న. అయితే బాబు మాత్రం గంటాకు అదే సూచించారు అని అంటున్నారు. ఆయనకు పోటీ చేయడానికి సీటు కూడా ఇపుడు విశాఖలో వెతుక్కోవాల్సిందే అంటున్నారు.

అయితే గంటాకు ఒంగోలుకు వెళ్లడం ఇష్టం లేదు అని అంటున్నారు. అలాగే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. 2019లోనే గంటాను ఎంపీగా పోటీ చేయమన్నారని టాక్ నడచింది.అపుడూ ఆయన నో చెప్పారనే గ్యాప్ వచ్చింది అని అంటారు ఏది ఏమైనా గంటా మనసులో ఆలోచనలు ఏంటో చూడాల్సి ఉంది. గంటా విశాఖ వదిలేస్తే మాత్రం అది టీడీపీలో సమూల మార్పులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News