బాబుకు బిగ్ షాక్... అక్టోబర్ 5 వరకూ రిమాండ్ పొడిగింపు

టీడీపీ అధినేత చంద్రబాబు పద్నాలుగు రోజుల రిమాండ్ ఆదివారంతో పూర్తి అయింది.

Update: 2023-09-24 12:43 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పద్నాలుగు రోజుల రిమాండ్ ఆదివారంతో పూర్తి అయింది. దాంతో వర్చువల్ గా ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచారు. బాబు రిమాండ్ ని అక్టోబర్ 5వ తేదీ వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. దీంతో చంద్రబాబు మరో పదకొండు రోజుల పాటు రాజమండ్రి కారాగారంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

దీని కంటే ముందు చంద్రబాబుని ఏపీ సీఐడీ విచారించింది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. అనంతరం బాబు రిమాండ్ ని కస్టడీని పొడిగించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమోలు దాఖలు చేసింది. దీని మీద చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరాలు చెప్పారు. ఆయనను విచారించారని, రిమాండ్ కూడా ముగిసిందని వాదించారు.

అయితే ఏసీబీ న్యాయస్థానం మాత్రం సీఐడీ కోరినట్లుగా బబు రిమాండ్ ని పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇక రెండు రోజుల పాటు చంద్రబాబుని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కానీ మరి కొన్ని రోజుల పాటు ఆయనని విచారించాలని సీఐడీ కస్టడీ కోరుతోంది. దీని మీద ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News