ఒక‌డు బూతుల నాని - మ‌రొక‌డు నీతుల నాని: చంద్ర‌బాబు స‌టైర్లు

వైసీపీ నాయ‌కులు.. కొడాలి నాని, పేర్ని నానిల‌పై స‌టైర్లువేశారు. ''ఒక‌డు బూతుల నాని-మ‌రొక‌డు నీతుల నాని '' అంటూ విరుచుకుప‌డ్డారు.

Update: 2024-04-18 06:19 GMT

ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మ‌చిలీప‌ట్నంలో నిర్వ‌హించిన వారాహి విజ‌య‌భేరి ఉమ్మ‌డి ప్ర‌చార స‌భ‌లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ నాయ‌కులు.. కొడాలి నాని, పేర్ని నానిల‌పై స‌టైర్లువేశారు. ''ఒక‌డు బూతుల నాని-మ‌రొక‌డు నీతుల నాని '' అంటూ విరుచుకుప‌డ్డారు. బూతుల నానికి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్న చంద్ర‌బాబు.. పేర్ని నానిని ఉద్దేశించి.. నీతుల నాని.. మాట‌లు చెప్ప‌డమే త‌ప్ప‌.. చేత‌ల్లో ఏమీ చేయ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. నీతుల నాని చెప్పులు చూపిస్తున్నాడ‌ని.. ప‌వ‌న్‌ను దూషిస్తున్నాడ‌ని.. అందుకేనా ప్ర‌జ‌లు గెలిపించింద‌ని ప్ర‌శ్నించారు.

నీ స‌భ‌ల‌కు నేనే క‌రెంటిస్తా!

సీఎం జ‌గ‌న్‌పైనా చంద్ర‌బాబు ఫైర‌య్యారు. జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కావ‌డం లేద‌ని అన్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు విద్యుత్ అధికారులు క‌రెంటు క‌ట్ చేస్తున్నార‌ని.. అన్న చంద్ర‌బాబు.. పాల‌న చేత‌కాక‌పోతే జ‌గ‌న్ సైకో రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. తాను జ‌గ‌న్ స‌భ‌ల‌కు కూడా క‌రెంటు ఇచ్చి చూపిస్తాన‌ని చంద్ర‌బాబు అన్నారు. జ‌గ‌న్ సైకో రెడ్డి ప్రోద్బ‌లంతో బూతుల నాని-నీతుల నాని రెచ్చిపోతున్నార‌ని, వీరికి తాము భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. క్లెమోర్ మైన్ల‌కే భ‌య‌ప‌డ‌లేద‌ని.. ఇప్పుడు వీళ్ల‌కు భ‌య‌ప‌డ‌తామా? అని ప్ర‌శ్నించారు. చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.

జ‌గ‌న్ గెలిస్తే..

జ‌గ‌న్‌కు మ‌రోసారి ఓటేస్తే.. జ‌రిగేది ప్ర‌జ‌లు, రాష్ట్ర అభివృద్ది కాద‌ని.. త‌న‌ను తాను కేసుల నుంచి ర‌క్షించుకోవ‌డంతోపాటు, బాబాయిని గొడ్డ‌లితో తెగ‌న‌రికిన వారిని ర‌క్షిస్తార‌ని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌చిలీప‌ట్నం హైవేలో నితీశ్ అనే వ్యక్తి 150 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి మాల్ కడుతుంటే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డుకున్నార‌ని అన్నారు. రేపు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఇక్క‌డ సైకోలే క‌ట్టి.. ప్ర‌జ‌ల ర‌క్తం పిండుతార‌ని విమ‌ర్శించారు. బాబాయిని దారుణంగా అడ్డంగా నరికిన వ్య‌క్తికి ఎంపీ టికెట్ ఇచ్చాడ‌ని.. రేపు త‌న‌కు అడ్డు వ‌స్తే.. ఎలాంటి వారినైనా లేపేస్తాడ‌ని.. ఇలాంటి వారికి మ‌రోసారి అధికారం ఇస్తారా? అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి ''లేదు.. లేదు'' అని బ‌దులు రావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News