ఇలాంటి వారికి ఆశ్రయమిస్తే ఎలా బాబూ..!
అనంతరం.. సుబ్బారాయుడితో రూ.2 లక్షలు ఖర్చు చేయించి.. ఖరీదైన రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేయించాడు శ్రీనివాసులు రెడ్డి.
జరిగిన తప్పులకు మాకు సంబంధం లేదని నాయకులు, పార్టీలు తప్పించుకోవచ్చు. కానీ, జరుగుతున్న పరిణామాల నుంచి మాత్రం తప్పించుకోలేరు. తాజాగా నంద్యాలలో జరిగిన సుబ్బారాయుడు దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడుగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి ఏ పార్టీకి చెందిన నాయకుడు అని ఆరా తీసిన పోలీసులు ఆయన టీడీపీ నేతగానే ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. సుబ్బారాయుడుని ఇంట్లో నుంచి బయటకు లాగి.. బండరాళ్లతో కొట్టి దారుణంగా చంపేశాడు.
అయితే.. శ్రీనివాసుల రెడ్డిని చేర్చుకున్న టీడీపీది తప్పా.. అంటే.. కాదు. కానీ, క్యారెక్టర్‌ను గమనించకుం డా.. అతను ఎలాంటి వాడో అంచనా వేసుకోకుండా పార్టీలో చేర్చుకున్నందుకు.. ఇప్పుడు ఆ పాపంలో టీడీపీ కూడాపాలు పంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇలాంటి వారికి ఆశ్రయమిస్తే ఎలా బాబూ! అనే మాట వినిపిస్తోంది. అసలు శ్రీనివాసులు రెడ్డి ఎలాంటి వాడు? అనేది చర్చనీయాంశం. ఇతను పక్కా క్రిమినల్. అందులో సందేహం లేదు. టీడీపీ అనుకూల మీడియా తాజాగా రాసిన వ్యవహారమే శ్రీనివాసులు రెడ్డి వ్యవహారాన్ని బయటపెట్టింది.
గతంలో వైసీపీలోనే ఉన్న శ్రీనివాసులురెడ్డి, సుబ్బారాయుడు ఇద్దరూ మంచి మిత్రులు. అయితే..ఈ క్రమంలోనే సుబ్బారాయుడిని శ్రీనివాసులు అప్పట్లోనే పక్కాగా మోసం చేసి.. నిండా ముంచేశాడు. ఇది అనుకూల మీడియాలో వచ్చిన కథనమే. సుబ్బారాయుడి దగ్గర ఉన్న 5 ఎకరాల పొలాన్ని శ్రీనివాసులు రెడ్డి తీసుకున్నాడు. దీనికి ప్రతిగా.. వేరే చోట ఖరీదైన రెండు ఎకరాలు ఇస్తానన్నాడు. దీనిని నమ్మి సుబ్బా రాయుడు తన పొలాన్ని ఇచ్చేశాడు. కానీ, తాను ఇస్తానన్న రెండు ఎకాలను శ్రీనివాసులు రెడ్డి ఇవ్వలేదు. ఇది ఒక దారుణ మోసం.
అనంతరం.. సుబ్బారాయుడితో రూ.2 లక్షలు ఖర్చు చేయించి.. ఖరీదైన రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేయించాడు శ్రీనివాసులు రెడ్డి. అంటే.. తాను ఇవ్వాల్సిన భూమిని ఇవ్వకుండా.. మరో చోట కూడా రెండు లక్షలతో భూమిని కొనిపించాడు. పోనీ. ఈ భూమి పత్రాలైనా ఇచ్చాడా? అంటే ఇవ్వలేదు. వాటిని తీసుకువెళ్లి.. తానే సొంతగా తాకట్టు పెట్టుకుని 4 లక్షలు అప్పు తెచ్చుకున్నాడు., అప్పులు ఇచ్చిన వారు సుబ్బారెడ్డి వెంట పట్టారు. ఇది రెండో మోసం.
దీనిని నిలదీయడమే సుబ్బారెడ్డి చేసిన తప్పు. అందుకే ఆయనను ఏకంగా లేపేశాడు. సుబ్బారెడ్డి తనపై ఒత్తిడి తెస్తుండడంతో టీడీపీనేతలను ఆశ్రయించి.. వారి ఆశ్రయం పొంది.. పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు క్రిమినల్ ఎవరు? వీరికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అనేది ఆలోచిస్తే.. విషయం తెలుస్తుంది. ఇలాంటి పనులు చేయకుండా పార్టీ నేతలను కంట్రోల్ చేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.