ఆ రెండు సీట్లలో ఓటమిపై చంద్రబాబు సీరియస్..!!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-19 05:01 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 175 స్థానాలకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది. అయితే... ఇంత వేవ్ లోనూ టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఓడిపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ పోటీచేసిన టీడీపీ అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడారు.

అవును... ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీకి కంచుకోటలాంటి స్థానంలో ఓటమిపాలవ్వడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా టీడీపీ కంచుకోట లాంటి కడపజిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఓటమిపై ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.

పైగా తనతోపాటు పవన్, లోకేష్ లు సైతం ప్రచారం చేసినా కూడా ఓటమి చెందడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా సచివాలయంలో తనను కలిసిన రాజంపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యం... ఓటమికి గల కారణాలపై నివేదిక సమర్పించారు. ఈ సమయంలోనే... రాజంపేటలో ఓడిపోవడం ఏమిటంటూ బాబు కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

మరోపక్క రెండు రోజుల క్రితం తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కూడా చంద్రబాబుని కలిశారు. ఆ నియోజకవర్గంలో ఓటమిపైనా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... గెలిచే స్థానాన్ని పోగొట్టారంటూ బాబు మండిపడ్డారని సమాచారం. పలుసూచనలు చేసినా వాటిని పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయాల్సిందని బాబు అన్నట్లు చెబుతున్నారు.

అయితే... తనను ఓడిస్తే నియోజకవర్గంలో పార్టీ ఇన్ ఛార్జి బాధ్యతలు తమకు వస్తాయనే ప్రయత్నాల్లో భాగంగా తన గెలుపు అవకాశాలను కొందరు గండికొట్టారని చంద్రబాబుకు జయచంద్రారెడ్డి వివరించే ప్రయతనం చేశారని సమాచారం. అయితే ఆ విషయాలన్నీ తనకు తెలుసని, ఇకపై అయినా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని బాబు సున్నితంగా సూచించారని అంటున్నారు.

ఏది ఏమైనా... టీడీపీకి గత 20ఏళ్లలో గెలవని నియోజకవర్గాల్లో కూడా గెలిచిన వేళ.. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఓడిపోవడంపై చంద్రబాబు మాత్రం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News