మోడీని బాబు ఇలా అడ‌గ‌రు.. అలా చేయ‌మ‌న‌రు.. గ్యారెంటీ!

ప్ర‌ధానంగా జ‌గ‌న్‌పై కేసుల వేగం పెంచాల‌ని.. సీబీఐ వేగం పెంచాల‌ని చంద్ర‌బాబు కోరినా.. మోడీ చేయ‌రంటూ... వారు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

Update: 2024-07-04 06:15 GMT

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు వెళ్లారు. ఆయ‌న గురువారం ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌నున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో వైసీపీ శిబిరంలో క‌ల‌కలం రేగింది. చంద్ర‌బాబు వెళ్లింది.. ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కే అయినా .. ఏమో.. రాజకీయంగా కూడా.. ఆయ‌న చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. త‌న‌పై ఉన్న కేసులు, త‌న సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఉన్న కేసుల‌ను తొక్కిపెట్టేందుకు ప్ర‌య‌త్నించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

వాటిని తొక్కిపెట్టుకునేందుకు త‌న ప‌లుకుబ‌డిని వినియోగించార‌ని, 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నా.. ఏనాడూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న ఢిల్లీని ప్ర‌శ్నించ‌లేద‌ని మేధావులు సైతం.. విమ‌ర్శించారు. ఇక‌, ఇదే ధోర‌ణిలో చంద్ర‌బాబు కూడా ఉంటార‌ని.. వైసీపీ నాయకులు అంచ‌నా వేసుకుని ఉంటారు. అందుకే వైసీపీ సోష‌ల్ మీడియాల్లో .. చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌పై కేసుల వేగం పెంచాల‌ని.. సీబీఐ వేగం పెంచాల‌ని చంద్ర‌బాబు కోరినా.. మోడీ చేయ‌రంటూ... వారు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

Read more!

కానీ, వాస్త‌వం ఏంటంటే.. చంద్ర‌బాబు అలా ఎప్ప‌టికీ అడ‌గ‌రు. త‌న రాజ‌కీయ ప‌లుకుబ‌డిని ఉప‌యోగిం చి.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌ను తీర్చుకునే నైజం ఆయ‌న‌కు లేదు. అనుకూల ప్ర‌భుత్వం ఉన్నా.. ప్ర‌తికూల ప‌రిస్థితి ఉన్నా.. ఆయ‌న ఎప్పుడూ.. ఇలా చేయ‌లేదు. ఇక‌పైనా చేయ‌బోరు. ఇలా చేయ‌డం వ‌ల్ల రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని కూడా ఆయ‌న ఊహించ‌రు. వైసీపీ నాయ‌కుల ఆలోచ‌న‌ల‌కు అంద‌ని విధంగానే చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు ఉంటాయి.

గ‌తంలో అనుకూల వాజ‌పేయి ప్ర‌భుత్వం ఉన్నా.. ఆయ‌న మావోయిస్టుల‌స‌మ‌స్య‌ను మాత్ర‌మే లేవ‌నెత్తా రు త‌ప్ప‌.. అప్ప‌టి రాజ‌కీయ నేత‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకోలేదు., అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ.. రాజ‌కీయంగా కాకుండా.. అభివృద్ధిపరంగానే ముందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు.. త‌ప్ప‌.. మోడీని జ‌గ‌న్‌పై ఉసిగొలిపే ప్ర‌య‌త్నం చేయ‌రు. పోనీ.. ఒక‌వేళ చంద్ర‌బాబు అలా చేస్తే.. ఏమ‌వుతుంది..? ఆయ‌న‌కే మ‌చ్చ‌లు వ‌స్తాయి. ఈ మాత్రం తెలివి ఆయ‌న‌కు లేదా? సో.. మోడీని ఎట్టి ప‌రిస్థితిలోనూ అలా చేయ‌మ‌ని అడ‌గ‌రు.. ఈ విష‌యంలో గ్యారెంటీ!!

Tags:    

Similar News

eac