చంద్రబాబు రేవంత్ భేటీ...క్లారిటీ వచ్చినట్లేనా ?

అదే సమయంలో క్లారిటీ అయితే ఇంకా అనేక విషయాల మీద రావాల్సి ఉంది.

Update: 2024-07-06 16:42 GMT

ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఏకంగా గంటా నలభై అయిదు నిముషాల పాటు జరిగిన ఈ భేటీలో తొలి అడుగు మాత్రమే పడింది. చర్చలు అయితే సామరస్యంగా సాగింది అని చెప్పాలి. అదే సమయంలో క్లారిటీ అయితే ఇంకా అనేక విషయాల మీద రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాలు విభజన హామీల విషయంలో మంత్రుల స్థాయి కమిటీని అలాగే అధికారుల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విభజన హామీల మీద లోతు అయిన చర్చ సాగింది అని తెలుస్తోంది. అదే టైం లో ఏడు మండలలు 2014లో ఏపీలో విలీనం అయ్యాయి. అందులో నుంచి అయిదు గ్రామాలను తిరిగి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలిసింది.

అయితే దీని మీద కేంద్ర హోం శాఖకు లేఖ రాయలని నిర్ణయించారు. ఒక విధంగా చూస్తే ఈ అయిదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా హైదరాబాద్ లో ఏపీకి ఒక భవనం కావాలని ఏపీ నుంచి ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అయితే తెలంగాణా స్థిరాస్తులను ఇచ్చేది లేదు అని రేవంత్ రెడ్డి నిరాకరించినట్లుగా చెబుతున్నారు.

ఇక విద్యుత్ బకాయిల విషయం తీసుకుంటే ఏపీకి ఏడు వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనల మీద తెలంగాణా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణాకే విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఏపీ నుంచి రావాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే విద్యుత్ బకాయిలు ఎవరివి ఎన్ని అన్న దాని మీద ఇద్దరు సీఎంల ముందు అధికారులు ఉంచారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే విభజన చట్టం ప్రకారం ఆస్తులు అప్పుల గురించి చర్చించినట్లుగా తెలిసింది. కానీ అది కూడా మంత్రుల కమిటీ మీదనే వదిలేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీ తెలంగాణా విభజన సమస్యలను చర్చించేందుకు రెండు కమిటీలు వేయాలన్నది నిర్ణయించారు. తెలంగాణా మంత్రుల కమిటీలో పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉంటారని తెలుస్తోంది.

ఈ మీటింగ్ తరువాత రేన్వంత్ రెడ్డి ఏపీ మంత్రులకు చంద్రబాబుకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం బయటకు వచ్చి బాబు ను కారు దాకా దిగబెట్టారు. అలా ఘనంగా వీడ్కోలు పలికారు. మరో వైపు చూస్తే విభజన సమస్యలు పరిష్కారం అన్నవి ఒక్క రోజులో అయ్యేవి కావు అని ఇది తొలి అడుగు అని రెండు రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. ముందు ముందు పరిష్కారానికి గల అవకాశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News