చంద్రబాబుకు హైకోర్టులో దక్కని ఊరట

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2023-10-27 06:49 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పిన సూచనలను జైలు అధికారులు పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించాల్సి ఉందని, ఆ విషయాన్ని హెల్త్ బులిటెన్ లో జైలు అధికారులు పేర్కొనలేదని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ జరిపేందుకు న్యాయమూర్తి జ్యోతిర్మయి నాట్ బిఫోర్ మీ అన్నారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ పిటిషన్ విచారణలో ప్రత్యామ్నాయ మార్గాలకు తన ఉత్తర్వులు అడ్డురావని జస్టిస్ జ్యోతిర్మయి అన్నారు. ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.

హౌస్ మోషన్ పిటిషన్ విచారణ నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతిర్మయి బెంచ్ ముందుకు 8వ కేసుగా వచ్చింది. ఈనెల 29 వరకు హైకోర్టుకు దసరా సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, 30వ తారీకున కోర్టు పునః ప్రారంభం కానుంది. దీంతో, చంద్రబాబుకు ఈ రోజు హైకోర్టులో చుక్కెదురైనట్లయింది.

Tags:    

Similar News