చిరుత ఎదురుపడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

అందుకు భిన్నంగా చిరుత పులులు ఎదురు పడిన వెంటనే.. రెండు చేతులు పైకెత్తి.. పెద్దగా అరవాలి.

Update: 2023-08-30 03:47 GMT

కారణం ఏదైనా కానీ చిరుత పులులు జనావాసాల్లోకి ఇటీవల కాలంలో తరచూ వస్తున్నాయి. వేగంగా పరిగెత్తే చిరుత కంట పడితే.. దాని నుంచి తప్పించుకోవటం కష్టమని పలువురు చెబుతారు. అయితే.. అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా.. జాగ్రత్తగా వ్యవహరిస్తే చిరుత బారి నుంచి ఎలాంటి అపాయం లేకుండా తప్పించుకునే మార్గం ఉందని చెబుతుంటారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్పటంతో పాటు.. చిరుత ఎదురు పడినప్పుడు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.

దేశంలో పులల కంటే చిరుతపులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద పులలతో పోలిస్తే వీటి నిష్పత్తి ఒకటికి ఎనిమిదిగా చెబుతుంటారు. తమకు అవసరమైన ఆహారం దొరకని సమయంలోనూ.. నీళ్లు దొరకని వేళలోనూ ఇవి జనావాసాల్లోకి వస్తుంటాయి. అనూహ్యంగా చిరుత ఎదురు పడితే.. అస్సలు పారిపోకూడదు. చిరుతను చూసినంతనే వేగంగా వెనక్కి పరిగెడితే.. అది మనల్ని వేటాడుతుంది. దాని వేగం ముందు మనుషుల వేగం ఏ మాత్రం సరిపోదు. దీంతో ప్రాణాలు పోవటం ఖాయం.

అందుకు భిన్నంగా చిరుత పులులు ఎదురు పడిన వెంటనే.. రెండు చేతులు పైకెత్తి.. పెద్దగా అరవాలి. అప్పుడు తన కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న జంతువుగా అది భావిస్తుంది. దీంతో.. అది వెనక్కి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువ.

అడవి జంతువుల సైకాలజీ ప్రకారం.. ఆకారంలో తనకంటే పెద్దగా ఉన్న జంతువుల మీద సాధారణంగా దాడి చేసేందుకు ఇష్టపడవు. చిరుతలు ఎదురుపడినప్పుడు వెనక్కి తిరిగి పరిగెత్తటం.. చెట్లు ఎక్కటం లాంటివి చేయటం ప్రమాదాల్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది.

చిరుతలు ఎదురు పడినప్పుడు వెనక్కి పరిగెత్తటం.. పొదల మాటున దాక్కోవటం.. చెట్లు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. వాటికి కాస్త దూరంలోనే ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా.. దాని ఎదురు నిలబడి చేతులు పైకెత్తి.. పైకి పెద్దగా అరవాలి. దాని కదలికల్ని ఒక కంట కనిపెడుతూ.. నెమ్మదిగా వెనక్కి నడవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

చాలా దగ్గరగా ఎదురుపడితే మాత్రం వెంటనే చేతులు పైకెత్తి పెద్దగా అరుస్తూ.. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి. ఇలాంటి సందర్భాల్లో దాడి చేసే అవకాశం చాలా తక్కువని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. చిరుత విషయంలో ఒక విషయాన్ని అస్సలు మిస్ కాకూడదు. అది వేటాడాలని డిసైడ్ అయితే మాత్రం ఎంత దూరమైనా పరిగెడుతూ వేటాడుతుంటి. అందుకే.. చిరుత కనపడితే పరిగెత్తే పని మాత్రం అస్సలు చేయకూడదు. చేతిలో కర్ర ఉన్నా సరే.. చిరుత బెదురుతుంది.

Tags:    

Similar News