చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు!
చికోటి ప్రవీణ్.. లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ చీకటి కోణాలు బయటపడ్డాయంటూ నిన్న మొన్నటివరకూ వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి చికోటి ప్రవీణ్ వ్యవహారం వార్తల్లోకెక్కిందని తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేసినందుకు పోలీసులు షాక్ ఇచ్చారని అంటున్నారు!
క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కారని వార్తల్లోకెక్కిన చీకోటి ప్రవీణ్.. మరోసారి వివాదాల్లో నిలిచారని తెలుస్తుంది. హైదరాబాద్ సిటీలోని లాల్ దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఈ సమయంలో అక్కడికి చికోటి ప్రవీణ్ కూడా వెళ్లారని తెలుస్తుంది.
అవును... బోనాల సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారిని ఇవాళ చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... ఆయన తన ప్రైవేటు సెక్యూరిటీతో ఆలయానికి వచ్చారట. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత భద్రతాసిబ్బంది గన్ తో ఆలయంలోని వెళ్లే ప్రయత్నం చేశారని అంటున్నారు.
చికోటి ప్రవీణ్.. లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారని అంటున్నారు. ఆ సమయంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారట. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం.
ఈ విషయాలపై స్పందించిన పోలీసులు... జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని చెబుతూ... ఆ వెపన్స్ కి లైసెన్స్ లు ఉన్నాయా లేదా అనేవిషయాలపై విచారిస్తున్నారని సమాచారం.
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క లాల్ దర్వాజ్ బోనాల పండగ సందర్భంగా సింహావాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకూండ తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే పాతబస్తీలో పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.