టెక్నాలజీలో చైనా దూకుడుకు ఇదో ఉదా... వీడియో వైరల్!

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని వ్యవస్థల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-02 01:30 GMT

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని వ్యవస్థల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏ దేశం ముందుంటే.. ఆ దేశం అభివృద్ధిలోనూ ముందుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఆ విషయంలో అమెరికాతోపాటు చైనా కూడా దూసుకుపోతుందని చెబుతున్నారు.

అవును... వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అధినాతన డేటా అనలటిక్స్, ఏఐ అల్గోరిథం, అధునాతన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్, హార్ట్ వేర్ యాక్సిలరేటర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తో సహా వివిధ కీలక విభాగాలలో చైనా దూసుకుపోతుందని చెబుతున్నారు.

వాస్తవానికి ప్రారంభంలో చైనా ఏఐ అభివృద్ధి పరంగా చాలా పాశ్చాత్య దేశాల కంటే వెనుకబడి ఉంది. అక్కడ పరిశోధనల్లో ఎక్కువ భాగం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన శాస్త్రవేత్తలే ఉండేవారు. ఈ సమయంలో... చైనీస్ ప్రభుత్వం ఏఐ అభివృద్ధి కోసం ఓ జాతీయ ఎజెండాను స్థిరంగా అభివృద్ధి చేసింది.

2016లో చైనీస్ కమ్యునిస్ట్ పార్టీ తన పదమూడో పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో భాగంగా... 2030 నాటికి ప్రపంచ ఏఐ నాయకుడిగా చైనా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో... ఇప్పుడు చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని నౌకాశ్రయంలో టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నారు.. 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకునే విషయంలో చైనా ఎంతలా ముందుకు దూసుకుపోతుందనే విషయాలని తెలిపేలా ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చైనా పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి!

ఈ వీడియో గ్వాంగ్ జౌలోని చైనా నౌకాశ్రయానికి సంబంధించిందని అంటున్నారు. ఇక్కడ ఉద్యోగులు 5జీ రిమోట్ తో షిప్ లను అన్ లోడ్ చేస్తున్నారు! అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలు.. మానవ సహాయం లేకుండానే కంటైనర్ లను ఆటోమేటిక్ గా ట్రాకులు తీసుకెళ్లి వాటిని లోడ్ చేస్తున్నాయి! ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Tags:    

Similar News