చైనాను ఊపేసిన పెను తుఫాను.. రెడ్ అలెర్ట్ జారీ!
భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం కూడా వాటిల్లినట్టు స్థానిక మీడియా చెప్పినా.. వివరాలు తెలియాల్సి ఉంది.
పొరుగున్న ఉన్న చైనాను `యాగి` పెను తుఫాను తీవ్రస్థాయిలో కుదిపేసింది. వాస్తవానికి పెద్ద ప్రభావం ఉండదని చైనా ప్రకటించిన గంటల వ్యవధిలోనే హైనాన్ నగరాన్ని తుఫాను తుడిచి పెట్టేసింది. ప్రకృతి విలయంతో ఇక్కడి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా మిగిలిపోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం కూడా వాటిల్లినట్టు స్థానిక మీడియా చెప్పినా.. వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు.. యుద్ధ ప్రాతిపదికన కదిలియ సర్కారు యంత్రాంగం.. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను క్షణాల్లో పునరావాస కేంద్రాలకు తరలించింది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం అయ్యాయి. ఆస్తి, ప్రాణనష్టం భారీగా ఉండొచ్చన్న అధికార యంత్రాంగం.. వివరాలను మాత్రం చెప్పక పోవడం గమనార్హం. మరోవైపు.. చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
చైనా తుఫానుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నాయి. వీటికి సంబం ధించిన వీడియోలు కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. స్థానిక పునరావాస కేంద్రాల్లో లక్షల మందికి ఆశ్రయం కల్పించారు. సుమారు 4 లక్షల మందికిపైగానే యాగి తుఫాను ప్రభావానికి గురయ్యారని.. స్థానిక మీడియా వెల్లడించింది. రాకాసి గాలుల ప్రభావానికి పెద్ద పెద్ద చెట్లు కూడా చివురు టాకుల్లా వణుకుతు న్న, విరిగిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
యాగి తుఫానుపై ముందస్తు సమాచారం ఇచ్చామని ప్రపంచ వాతావరణ కేంద్రం(అమెరికా) వెల్లడించింది. అయితే.. దీనిని చైనా నిర్లక్ష్యం చేసిందన్న వార్తలు వచ్చాయి. ఈ తుఫానులో చిక్కుకుని వెయ్యి మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దీనిని స్థానిక మీడియా ధ్రువీకరించడం లేదు. చైనాలో ఇప్పుడు చోటు చేసుకున్న యాగి తుఫాను.. దాదాపు 100 ఏళ్ల తర్వాత సంభవించిన తుఫానుగా పేర్కొనడం గమనార్హం.