జగన్ అంటే కూటమికి భయం....నిజమట !

అవునా వైసీపీ అధినేత జగన్ అంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి భయమా.

Update: 2024-10-01 03:52 GMT

అవునా వైసీపీ అధినేత జగన్ అంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి భయమా. ఈ విషయం ఏ వైసీపీ నేతనో చెబితే ఏమో కానీ తలపండిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చెప్పారు. ఆయన తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజకీయం కోసమే వాడుకుందని విమర్శలు చేశారు. అది సుప్రీం కోర్టులో స్పష్టం అయింది అన్నారు. సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు టీటీడీ న్యాయవాది సిద్ధాద్ర లూద్రా సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేశారు అని ఆయన ఎద్దేవా చేశారు.

తిరుపతిని దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం బాగా వాడుకుంటోందని ఆయన సెటైర్లు వేశారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఏ మాటా అనకపోయి ఉంటేనే బాగుండేది అని కూడా చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. కానీ ఇపుడు ఏమి జరిగిందని సుప్రీం కోర్టులో ఏమైంది అని ఆయన అంటూ కూటమి ఇబ్బందులో పడిందని అన్నారు

అసలు పవిత్రమైన శ్రీవారి లడ్డూని రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. అలా తేవడం తప్పు అని కూడా పేర్కొన్నారు. మరో వైపు చూస్తే టీటీడీ ఈవో లడ్డూ నెయ్యి విషయంలో తొందర పడ్డారు అని చింతా మోహన్ ఆయనను కూడా తప్పు పట్టారు.

గతంలో టీటీడీ ఈవోలుగా పనిచేసిన ఐవైఆర్ క్రిష్ణారావు, ఎల్వీ సుబ్రమణ్యం, గోపాల్ ఎంతో చక్కగా విధులను నిర్వహించారని ఆయన కితాబు ఇచ్చారు. ప్రస్తుత ఈవో శ్యామలరావు మాత్రం తడబడుతున్నారని ఆయన నిందించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు తిరుమలకు వస్తే ఏ ఉన్నతాధికారి ఆయన పక్కన ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన టీటీడీ ఈవోని ప్రశ్నించారు. అలాగే ఒక చిన్న నాయకుడు సిఫారసు చేస్తే ఎలా ఇరవై మందికి శ్రీవారి దర్శనం చేయిస్తారు అని ఈవోని నిలదీశారు.

మరో వైపు చూస్తే జగన్ అంటేనే కూటమికి భయం అని కూడా చింతా మోహన్ కామెంట్స్ చేసారు. లేకపోతే నెల రోజుల పాటు తిరుమలలో అంతటా సెక్షన్ 30ని అమలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో అంతా పోలీసుల చేతిలో పెట్టించి పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక వైపు ఎక్కడ చూసినా కూటమి ఫ్లెక్సీలు కటౌట్లు కనిపిస్తూంటే మరో వైపు సెక్షన్ 30ని పెట్టారని ఆయన మండిపడ్డారు. నిద్రపోతున్న బీజేపీ అయితే లడ్డూల వ్యవహారంలో పవిత్రత అంటూ అరచి గగ్గోలు పెట్టడం ఏ రకమైన రాజకీయమో చెప్పాలని ఆయన కోరారు. మొత్తానికి సుప్రీం కోర్టు తీర్పు కాదు కానీ ఈ కాంగ్రెస్ నేత కూటమిని గట్టిగానే వేసుకున్నారు.

Tags:    

Similar News