లోకేష్ కోసం సీఐడీ వెయిటింగ్ ఇక్కడ..!
అయితే లోకేష్ కోసం వెయిటింగ్ అన్నట్లుగా ఏపీ సీఐడీ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
లోకేష్ గత నాలుగైదు రోజులుగ ఢిల్లీలో ఉన్నారు. ఆయన అక్కడ పార్టీ ఎంపీలతో కలసి పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ విషయం ప్రస్తావించేలా చూశారు. అదే టైం లో పార్లమెంట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ బాబు అరెస్ట్ అన్నది కొంత ఫోకస్ అయ్యేల ప్రయత్నం మరోటి చేశారు.
ఇదిలా ఉంటే లోకేష్ ఢిల్లీ టూర్ ముగిసింది. సోమవారం రాత్రి ఆయన ఏపీకి రాబోతున్నారు. నేరుగా రాజమండ్రిలో ల్యాండ్ కాబోతున్నారు. అయితే లోకేష్ కోసం వెయిటింగ్ అన్నట్లుగా ఏపీ సీఐడీ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
ఈ మేరకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు అని అంటున్నారు. లోకేష్ ఇలా రావడమే తరువాయి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన హై కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కూడా మంగళవారం విచారణకు రాబోతున్నాయి.
ఈ నేపధ్యంలో బాబు బయటకు వస్తారా రారా అన్నది ఒక చర్చగా ఉంది. ఈ టైం లో లోకేష్ ని అరెస్ట్ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే లోకేష్ పేరు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో ఉంది. అలాగే ఫైబర్ గ్రిడ్ స్కాం లో అరెస్ట్ చేయనున్నారు అని ప్రచారం సాగుతోంది.
అయితే బాబు అరెస్ట్ వల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. అలాగే వైసీపీకి పట్ల ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత పెరిగింది అంటున్నారు. దాంతో ఈ టైం లో లోకేష్ అరెస్ట్ అంటూ తొందరపడతారా అన్న చర్చ అయితే సాగుతోంది. కానీ అనివార్యం అనుకుంటే మాత్రం అరెస్ట్ చేసి తీరుతారు అని అంటున్నారు.
లోకేష్ ని అరెస్ట్ చేస్తే సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయన్న దాని మీద వైసీపీ ప్రభుత్వం మధింపు చేసింది అని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం నుంచి డైరెక్షన్ రావడం తరువాయి అన్నట్లుగా ఏపీ సీఐడీ రెడీగా ఉంది అంటున్నారు. సో లోకేష్ అరెస్ట్ అన్నది ఇపుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు. ఒక వేళ లోకేష్ అరెస్ట్ అయితే మరింత హీటెత్తిపోవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.