బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే: రాహుల్‌కు పోస్టర్ల సెగ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయన శనివారం నిజామాబాద్, బోధన్‌లలో పర్యటించి.. రోడ్ షో సహా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ఇదే జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పర్యటించి.. రోడ్ షోలో పాల్గొంటారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లోనూ పాల్గొంటారు.
అయితే..రాహుల్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్, బోధన్‌లో వెలిసిన కొన్ని పోస్టర్లు కలకలం రేపుతు న్నాయి. రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిసినట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే నిజామాబా ద్, బోధన్‌లో గోడలపై పోస్టర్లు వెలియడంతో, దానిపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీనాయకులు అలెర్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు పోస్టర్లలో కనిపిస్తున్నాయి. ఇక, ఆయా పోస్టర్లపై `బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దేనని.. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీయే`నని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందేనని... ముక్కు నేలకు రాయాల్సిందేనని పోస్టర్లలో డిమాండ్ చేశారు. పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు. పోస్టర్లలో బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటు లేక అల్లాడుతున్నారు. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా? అని ఉన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లేనని పోస్టర్లలో పేర్కొన్నారు.
ఇది ఎవరి పని?
అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, రాష్ట్ర సారథి రేవంత్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు.. ఇటు బీజేపీ..అటు బీఆర్ ఎస్ పార్టీలను దుయ్యబడుతున్నారు. పోస్టర్ల ఏర్పాటు పై వారు పోలీసులను ఆశ్రయించారు