జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు... మ్యాజిక్ ఫిగర్..?

ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం... 56 స్థానాల్లో పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 41స్థానాల్లోనూ.. 39 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతుంది.

Update: 2024-10-08 04:35 GMT

జమూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేపట్టారు! ఈ సమయంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ అందుతున్న ఫలితాల ప్రకారం... నేషనల్ కాన్ఫరెన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది.

అవును... జమ్మూకశ్మీర్ లో 90 అసెంబ్లీ సీట్లున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీర్ రీజియన్ లో 47 సీట్లు ఉన్నాయి. అయితే.. అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టనెంట్ గవర్నర్ కు ఉండటంతో.. జమ్ముకశ్మీర్ లో మ్యాజిక్ ఫిగర్ 48 అవుతుంది.

ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం... 56 స్థానాల్లో పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 41స్థానాల్లోనూ.. 39 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవ్వగా... వేర్వేరుగా పోటీ చేసిన పీడీపీ (2), బీజేపీ (24) వెనుకంజలో ఉన్నాయి.

కాగా జమ్ముకశ్మీర్ లోని 90 నియోజకవర్గాలకు మూడు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న సుమారు 10 సంవత్సరాల విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుచేయబడిన తర్వాత జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

2018 జూన్ లో మెహబూబా ముఫీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణం కుప్పకూలింది. విభజన తర్వాత నాటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇక్కడ గవర్నర్ పాలనను అమలు చేశారు.

Tags:    

Similar News