కాంగ్రెస్ కొత్త కొత్తగా... ఇక జాతకం మారుతుందా ?

కాంగ్రెస్ అర్ధ శతాబ్దం పాటు కొనసాగిన బంధానికి బరువైన వీడ్కోలు పలికింది. అంతే కాదు సరికొత్త బంధానికి బాటలు వేసింది.

Update: 2025-01-15 23:30 GMT

కాంగ్రెస్ అర్ధ శతాబ్దం పాటు కొనసాగిన బంధానికి బరువైన వీడ్కోలు పలికింది. అంతే కాదు సరికొత్త బంధానికి బాటలు వేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఆరు అంతస్థుల భారీ భవనాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా నిర్మించింది. దానిని కాంగ్రెస్ అగ్ర నేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరా గాంధీ భవన్ అని పేరు పెట్టారు.

ఇదిలా ఉంటే కాంగ్రే పార్టీ నుంచి విడిపోయిన తరువాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ పేరుతో ఒక సొంత పార్టీని జాతీయ స్థాయిలో 1978లో ప్రారంభించారు. ఆ పార్టీకి ఢిల్లీలో అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగాళలో ఈ రోజు దాకా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ భవనంలో కాంగ్రెస్ ఎన్నో విజయాలను చవి చూసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడా మిగిల్చుకుంది. ఇ1977లో కాంగ్రెస్ పార్టీ ఓడాక కాంగ్రెస్ ఐ ఏర్పాటు చేసాక ఈ భవనం నుంచే కాంగ్రెస్ మళ్లీ తన రాజకీయ జాతకాన్ని మార్చుకుంది. ఇక్కడ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాక రెండెళ్ళు తిరగకుండానే జనతా పార్టీని ఓడించి కేంద్రంలో మూడవసారి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు.

అదే విధంగా చూస్తే 1984లో కాంగ్రెస్ కి చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా 400 ఎంపీల కంటే అధికంగా సీట్లు వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. రాజీవ్ గాంధీ అలా ప్రధాని అయ్యారు. ఇక 1991 నుంచి 1996 దాకా అలాగే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ అధికారం అందుకుంది.

ఇపుడు చూస్తే కాంగ్రెస్ ఒక విధంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. దాంతో పాటు ఇపుడు కొత్త భవనంలోకి మారింది. నిజానికి కాంగ్రెస్ ఈ భవనాన్ని వీడడానికి కూడా సుముఖంగా లేదు అయితే ప్రభుత్వ బంగళాలలో పార్టీల కార్యకలాపలు నిర్వహించవద్దు అని కేంద్రం తీసుకున్న నిర్ణయంతోనే కాంగ్రెస్ కొత్త ఆఫీసు నిర్మించుకుంది. అయితే పాత ఆఫీసు మీద మక్కువతో అక్కడ కూడా పార్టీ యాక్టివిటీని కొంతలో కొంత నిర్వహించాలని అనుకుంటోందిట.

మరో వైపు చూస్తే ఆరు అంతస్తులతో సువిశాలంగా నిర్మించిన ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం పనులు 2009లో ప్రారంభం అయ్యాయి. పదిహేనేళ్ళ పాటు ఈ నిర్మాణానికి సమయం పట్టింది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ కి కొత్త కళ వచ్చినట్లు అయింది. రానున్న రోజులల్లో కాంగ్రెస్ తన రాజకీయ జాతకాన్ని ఇక్కడ నుంచే మార్చుకుంటుందా తన కొత్త వ్యూహాలకు ఇక్కడ నుందే పదుని పెడుతుందా అంటే వేచి చూడాల్సిదే.

Tags:    

Similar News